నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే, బాలకృష్ణ.. తన ‘ఆదిత్య 369’కి కొనసాగింపుగా రూపొందనున్న ‘ఆదిత్య 999 మ్యాక్స్’తోనే మోక్షజ్ఞ కథానాయకుడిగా పరిచయం కానున్నట్టు క్లారిటీ ఇచ్చారు. పైగా ఈ సినిమాని దర్శకుడు క్రిష్ తెరకెక్కించనున్నాడని కూడా టాక్ వినిపించింది. కానీ, ఇంకా ఈ సినిమా స్టార్ట్ కాలేదు. ఇక ఎప్పుడు ఈ సినిమా మొదలవుతుంది ?, ఎప్పుడు పూర్తి అయి రిలీజ్ అవుతుంది ? అంటూ ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు.
నిజానికి ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయింది. పైగా ఈ సినిమాలోని ఇతర క్యాస్టింగ్ పై క్రిష్ ఆ మధ్య ఫోకస్ పెట్టాడని కూడా వార్తలు వచ్చాయి. మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. అన్నట్టు ఈ సినిమాలో బలమైన క్యాస్టింగ్ కూడా ఉంటుందట. అలాగే, మోక్షజ్ఞ లుక్ కూడా చాలా స్టైలిష్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఆ మధ్య తన వారసుడి ఎంట్రీ పై బాలయ్య మాట్లాడుతూ.. ‘మోక్షజ్ఞను ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో నాకు తెలుసు. మోక్షజ్ఞ కోసం ఒక ఐదు ఆరు స్క్రిప్ట్స్ నా మైండ్ లోనే రెడీగా ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు. రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నారు.
