
‘లెజెండ్’ వంటి భారి హిట్ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 98వ సినిమా ‘లయన్’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అప్పుడే, ఈ సినిమా తర్వాత బాలకృష్ణ నటించబోయే 99వ సినిమా గురించి మీడియాలో చర్చ మొదలయ్యింది. ‘లౌక్యం’తో సాలిడ్ హిట్ కొట్టిన శ్రీవాస్ బాలయ్య 99వ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కోన వెంకట్, గోపి మోహన్ కథ అందిస్తున్నారు.
బాలయ్య సరసన ఈ సినిమాలో బొద్దుగుమ్మ హన్సిక నటించనుందని ఫిల్మ్ నగర్ సమాచారం. మరోవైపు క్యూట్ గర్ల్ రెజినా పేరు కూడా వినిపిస్తుంది. ‘లయన్’ షూటింగ్ పూర్తయిన వెంటనే శ్రీవాస్ సినిమా ప్రారంభం అవుతుంది. స్క్రిప్ట్ ఫైనలైజ్ కావడంతో హీరోయిన్, ఇతర టెక్నీషియన్ల ఎంపిక పూర్తి చేయాలని దర్శకుడు భావిస్తున్నారు. ఈ సినిమాకు ‘డిక్టేటర్’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతుంది.