పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణణు దేశాయ్ నిశ్చితార్థం చేసుకుందనే విషయం తెలిసిందే. కానీ ఆమెకు కాబోయే భర్త ఎవరు? ఏం చేస్తాడు? అనే విషయాల్లోనే ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. రేణు ఎప్పటి నుంచో తన పెళ్లి ప్రస్తావన తీసుకొస్తున్నా తనకు కాబోయే భర్త గురించి ఎప్పుడూ చెప్పలేదు.
దీంతో వరుడిది రాజస్థాన్ అని కొందరు.. కాదు పుణే అని ఇంకొందరు చెబుతున్నారు. రేణు దేశాయ్ తనకు కాబోయే భర్త గురించి ఆమె స్వయంగా చెప్పే వరకూ ఇలాగే రూమర్స్ వస్తూనే ఉంటాయి. అయితే ఆమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొందరు వ్యతిరేకించగా ఇంకొందరు అభినందిస్తున్నారు.