
‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో సినిమా షూటింగ్ ప్రారంభించలేదు. శ్రీను వైట్ల దర్శకత్వంలో డివివి దానయ్య ఓ సినిమాను నిర్మిస్తారని ప్రచారం జరిగినా ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. రచయిత ద్వయం కోన వెంకట్ – గోపి మోహన్ లు చెప్పిన కథకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఓ క్రేజీ దర్శకుడు ఈ కథతో రామ్ చరణ్ హీరోగా సినిమా తెరకేక్కిస్తారని కోన వెంకట్ తెలిపారు.
‘రామ్ చరణ్ కోసం నేను, గోపి మోహన్ కలసి రాస్తున్న కథ రెడీ అయ్యింది. హీరోఇజం & వినోదంతో కూడిన ఓ కొత్త కథ ఇది. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. ఈ సినిమాకు ఓ క్రేజీ దర్శకుడు దర్శకత్వం వహిస్తారు. మొదటిసారి ఈ దర్శకుడితో కలసి పని చేయబోతున్నాం. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం. అంటూ కోన వెంకట్ సోషల్ మీడియాలో వెల్లడించారు. దాంతో ఎవరా క్రేజీ దర్శకుడు అంటూ మెగా అభిమానులలో చర్చలు మొదలయ్యాయి.