రోబో 2.0 లో కమల్ హాసన్ విలన్ గా ఎందుకు నటించలేదంటే..?

kamal-haasan-rajinikanth
రజనీకాంత్, కమల్ హాసన్… ఇద్దరూ అగ్రనటులే. కమల్ హాసన్ వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే, రజనీ మాత్రం తన స్టైల్ తో, ఛరిష్మా తో ఆభిమానులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. రజనీకాంత్ ప్రస్తుతం రోబో2.0 లో శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి కమల్ హాసన్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలియచేశారు.

అదేమిటంటే… రోబో2.0 సినిమాలో కమల్ హాసన్ ని విలన్ గా నటించమని దర్శకుడు శంకర్ కోరాడట. అయితే ఆ ప్రతిపాదనను కమల్ తోసిపుచ్చాడంట. కారణం ఏమిటంటే… కమల్ హాసన్, రజనీకాంత్ చాలా సినిమాల్లో కలిసి నటించారు. తర్వాత ఎవరికీ వారు వేర్వేరు సినిమాలలో నటిస్తూ వస్తున్నారు. కానీ మళ్ళీ వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించాలంటే వీరిలో ఒకరు ఆ సినిమా నిర్మాతగా ఉండాలని కమల్, రజనీ నియమం పెట్టుకున్నారంట. కానీ రోబో 2.0 భారీచిత్రం కావడంతో నిర్మాణం కష్టం కావడంతో నియమం ప్రకారం కమల్ హాసన్ రోబో 2.0 లో నటించలేదని సమాచారం. ప్రస్తుతం రోబో2.0 సినిమాలో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

Exit mobile version