రాజశేఖర్ 2015లో 6 సినిమాల్లో కనిపిస్తాడట.!

rajashekar

యాక్షన్ హీరో డా. రాజశేఖర్ నటించిన ‘గడ్డం గ్యాంగ్’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. సోలో హీరోగా స్లోగా సినిమాలు చేస్తున్న రాజశేఖర్ 2015లో 6 సినిమాల్లో కనిపించి ప్రేక్షకులను మెప్పిస్తానని అంటున్నాడు. ఈ రోజు రాజశేఖర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇక పై నేను సోలో హీరో సినిమాలకే పరిమితం కావడం లేదు. మంచి పాత్రలు కూడా చెయ్యడానికి సిద్దంగా ఉన్నాను. అందులో భాగంగానే ఈ ఏడాది 6 సినిమాల్లో కనిపిస్తా’ అని అంటున్నాడు.

అలాగే రాజశేఖర్ ‘ఎవడైతే నాకేంటి’, ‘గోరింటాకు’ సినిమాల తర్వాత సరైన హిట్ లేదని, కానీ గడ్డం గ్యాంగ్ కచ్చితంగా మంచి హిట్ అందుకుంటానని చాలా నమ్మకంగా ఉన్నాడు. అలాగే క్రైమ్ కామెడీ జోనర్ లో రానున్న గడ్డం గ్యాంగ్ సినిమా తెలుగులో మరికొన్ని ఫ్రెష్ సినిమాలు రావడానికి నాంది పలుకుతుందని అన్నాడు. రాజశేఖర్ గడ్డం గ్యాంగ్ కాకుండా ‘పట్ట పగలు’, ‘అర్జున’, ‘వందకు వంద’ సినిమాలలో నటిస్తున్నాడు.

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న రాజశేఖర్ కి 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Exit mobile version