టాలీవుడ్‌లో స్టార్ హీరోల స్టామినాకు రూ.100 కోట్ల షేర్ మార్క్ ఒక బెంచ్‌మార్క్‌గా మారింది. ఇప్పటికే దాదాపు అందరూ టాప్ హీరోలు కనీసం ఒక్కసారైనా ఈ రికార్డును సాధించగా, సీనియర్ స్టార్స్‌లో నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున మాత్రమే ఇంకా ఈ మైలురాయిని చేరుకోవాల్సి ఉంది.
బాలకృష్ణ తన నెక్స్ట్ చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న NBK 111తో ఈ రూ.100 కోట్ల షేర్ మార్క్‌ను అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద క్లిక్ అయితే బాలయ్య ఖాతాలో మొదటి వంద కోట్ల షేర్ పడటం ఖాయం. మరోవైపు నాగార్జున కూడా తన ల్యాండ్‌మార్క్ చిత్రం కింగ్ 100 తో ఈ అరుదైన మైలురాయి పై కన్నేశాడు.
ఈ క్రమంలో మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న ఊపు చూస్తుంటే, ఆయన మరో రెండు రోజుల్లోనే ఈ రూ.100 కోట్ల షేర్ క్లబ్‌లో చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మరి రవితేజ తర్వాత బాలయ్య, నాగ్ కూడా తమ రాబోయే చిత్రాలతో ఈ రూ.100 కోట్ల రేసులో గెలిచి తమ ఖాతాలను తెరుస్తారో లేదో చూడాలి.
