
దాదాపు పదేళ్ళ తర్వాత ఈ ఏడాది వచ్చిన పవర్ఫుల్ పోలీస్ ఎంటర్టైనర్ ‘పటాస్’ తో అటు మాస్ తో పాటు ఇటు క్లాస్ ఆడియన్స్ ని కూడా మెప్పించి సూపర్ హిట్ ని అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో అర్థం చేసుకున్న కళ్యాణ్ రామ్ విభిన్న తరహా కథని చెప్తూనే ఎంటర్ టైన్మెంట్ ఉండే సినిమాలను ఎంచుకుంటున్నాడు. అలా చేసిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘షేర్’. అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సెన్సార్ వారు ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు.
దాంతో ఈ చిత్ర టీం ఈ సినిమా రిలీజ్ కి సరైన రిలీజ్ డేట్ ని లాక్ చేసే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాతో సక్సెస్ అందుకోవడం వలన ఈ సినిమాకి కూడా బిజినెస్ పరంగా చాలా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అంతే కాకుండా పటాస్ సక్సెస్ ఫాంని ఈ సినిమాతో కూడా కొనసాగిస్తారని కళ్యాణ్ రామ్ చాలా నమ్మకంగా ఉన్నాడు. మరి ఆ సక్సెస్ మంత్రని కళ్యాన్ రామ్ కొనసాగిస్తాడా.? లేదా.? అనేది తెలియాలంటే ఈ చిత్ర టీం మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.. కళ్యాణ్ రామ్ సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా కనిపించనుంది. మల్లికార్జున్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని కొమర వెంకటేష్ నిర్మించాడు.