నాగార్జున కూడా ఆ రేస్‌లోనే దిగుతాడా..?

Nagarjuna

అక్కినేని అఖిల్ ‘లెనిన్’, నాగచైతన్య ‘తండేల్’ హిట్లతో మంచి జోష్‌లో ఉన్న నాగార్జున తన 100వ చిత్రం ‘కింగ్ 100’ని సాలిడ్ అంచనాల మధ్య రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని డిసెంబర్ 2026 రేసులోకి తేనున్నట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.

రా కార్తీక్ దర్శకత్వంలో టబు, ఐశ్వర్య రాజేష్‌లతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కిక్కిరిసిపోవడంతో డిసెంబర్‌కు మార్చాలని మేకర్స్ యోచిస్తున్నారు. డిసెంబర్ రేసులో ఇప్పటికే ప్రభాస్ ‘ఫౌజీ’, బాలకృష్ణ ‘NBK 111’ సినిమాలు ఉన్నాయి.

దీంతో ఈ డిసెంబర్‌లో ట్రయాంగిల్ పోటీ తప్పేలా లేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే, ఈ విషయంపై నాగార్జున పుట్టినరోజైన ఆగస్టు 29న విడుదలయ్యే గ్లింప్స్‌తో పూర్తి క్లారిటీ రానుంది.

Exit mobile version