
ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో అందాల భామ నయనతారకి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనదు అని అందరిలోనూ బాగా నెగటివ్ ఒపినియన్ ఉంది. తను నటించిన సినిమాలకే చాలా వారకు ప్రెస్ మీట్స్ కి కానీ, ఆడియో ఫంక్షన్స్ కి కానీ, పబ్లిక్ ఈవెంట్స్ కి కానీ రాదు. అలాగే మీడియాలో కూడా పెద్దగా కనిపించక పోవడం వల్ల నయనతార విషయంలో నెగటివ్ గా మారాయి.
మే 1న నయనతార ప్రధాన పాత్రలో నటించిన ‘అనామిక’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పుడు ప్రొడక్షన్ టీం అందరి మదిలోనూ నయనతార అనామిక ప్రమోషన్స్ లో పాల్గొంటుందా? లేదా? అనే ప్రశ్న తిరుగుతోంది. ప్రస్తుతానికి ఈ సినిమా ప్రమోషన్స్ చాలా లో స్టేజ్ లో ఉన్నాయి.
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు. ఈ సినిమాలో బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘కహానీ’ సినిమాకి రీమేక్.