బాలయ్య 111 ట్రీట్: ‘ఓజి’ రేంజ్ మ్యాజిక్ చేయబోతుందా!

బాలయ్య 111 ట్రీట్: ‘ఓజి’ రేంజ్ మ్యాజిక్ చేయబోతుందా!

Published on May 29, 2026 9:00 AM IST

మన టాలీవుడ్ లో మోస్ట్ ఇంపాక్ట్ చూపించిన ఫస్ట్ గ్లింప్స్ లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే దర్శకుడు సుజీత్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఓజి’ గ్లింప్స్ కూడా డెఫినెట్ గా ఉంటుంది. ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేసిన ఈ గ్లింప్స్ తర్వాత దాని రేంజ్ లో తక్కువ నిడివి ఉండి ఎక్కువ ఇంపాక్ట్ చూపించేవి కనిపించలేదు.

అయితే అందుకు చాలా కారణాలు ఉండొచ్చు కానీ దీని రేంజ్ లో ఇప్పుడు నటసింహం బాలకృష్ణ నుంచి రానున్న ట్రీట్ ఉంటుందా అని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పుడు మేకర్స్ ముంబైలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓజి గ్లింప్స్ లో చూపించిన లొకేషన్స్ లోనే బాలయ్య 111 బృందం కూడా ఇప్పుడు ఉండడం ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఈ జూన్ 10న బాలయ్య పుట్టినరోజు కానుకగా సాలిడ్ ట్రీట్ ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పైగా బాలయ్య సినిమా కూడా గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లోనే కావడం విశేషం. మరి ఓజి తరహాలోనే సాలిడ్ విజువల్స్ ఓ రేంజ్ హైప్ ని మేకర్స్ అందిస్తారో లేదో అనేది చూడాల్సిందే. అసలే దీనికి కూడా థమన్ నే వర్క్ చేస్తుండడంతో ఈ ఫస్ట్ గ్లింప్స్ పై మరిన్ని అంచనాలు ఉన్నాయి.

తాజా వార్తలు