ఇప్పుడు మన టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ అలా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్లాసిక్ సినిమా ‘డార్లింగ్’ సెన్సేషనల్ హిట్ అయ్యింది. అయితే మన హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి నెక్స్ట్ సినిమా రీరిలీజ్ కి ఇప్పుడు లాక్ అయ్యింది. ఈసారి పవన్ బర్త్ డే కి పవన్ ప్లాప్ చిత్రం “పంజా” రీరిలీజ్ కి సిద్ధం అయ్యింది.
అయితే దీనికి ముందు చాలామంది “బద్రి” సినిమాని ఆశించారు. ఈ సినిమాతో ఖచ్చితంగా రీరిలీజ్ కి కొత్త రికార్డ్స్ పెట్టడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ బలంగా నమ్మారు. కానీ ఇప్పుడు పంజా ఎంట్రీ ఇచ్చింది. అయితే దీనికి కూడా సాలిడ్ పొటెన్షియల్ ఉంది కానీ బద్రి అయితే ఆ మేనియా వేరే లెవెల్లో ఉండేది.
పంజా లో కొన్ని మూమెంట్స్ వరకు ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వొచ్చు కానీ బద్రి తరహాలో ఫుల్ ఎంగేజింగ్ మూమెంట్స్ ఉండే సినిమా అయితే కాదు. సో బద్రి తో 10 కోట్ల ఓపెనింగ్స్ మార్క్ ఖాయం అనుకున్న ఫ్యాన్స్ ఇప్పుడు పంజా సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ అందిస్తారో చూడాలి. మరి పంజా సినిమాకి విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
