
ప్రస్తుతం అందరి దృష్టి సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా సినిమా ‘లింగ’పై ఉంది. బాక్సాఫీస్ బరిలో ఈ సినిమా ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని విషయంపై చర్చలు జరుగుతున్నాయి. రజినీకాంత్ తర్వాత తమిళంలో అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్, మాస్ ఇమేజ్ కల హీరోగా పేరు పొందిన విజయ్ నటించిన గత సినిమా ‘కత్తి’ 100 కోట్లు వసూలు చేసిందని దర్శకుడు మురుగదాస్ ప్రకటించారు. ‘కత్తి’ సినిమా కలెక్షన్స్ క్రాస్ చేసే సత్తా రజినీకాంత్ ‘లింగ’ సినిమాకుందా..? లేదా..? అని తమిళనాడులో అభిమానులు చర్చించుకుంటున్నారు.
రజినీకాంత్ పుట్టినరోజున కానుకగా ఈ నెల 12న విడుదలవుతున్న ‘లింగ’ సినిమాకు కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. సోనాక్షి సిన్హా, అనుష్క హీరోయిన్లుగా నటించారు. ఏఅర్ రెహమాన్ సంగీత దర్శకుడు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత. ఈ సినిమాలో రజినీకాంత్ డ్యూయల్ రోల్ లో సందడి చేయనున్నారు. ఈ సినిమాపై అభిమానులలో భారి అంచనాలు నెలకొన్నాయి.