‘ఛాంపియన్’ స్టేజ్ పై ‘పెద్ది’ అప్డేట్ ఇస్తాడా?

ఛాంపియన్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు భారీ చిత్రం “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో చేస్తున్న ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ గ్యాప్ లో రామ్ చరణ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రోషన్ మేక నటిస్తున్న అవైటెడ్ చిత్రం “ఛాంపియన్” ట్రైలర్ కోసం రాబోతున్న సంగతి తెలిసిందే. నేడు చేస్తున్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రామ్ చరణ్ తన మార్క్ ప్రెజెన్స్ కనబరచబోతున్నాడు.

అయితే పెద్ది సినిమా అప్డేట్ వచ్చి చాలా రోజులు అయ్యింది. మరి ఈ వేదిక మీదుగా ఆ సినిమా టీం కి తన బెస్ట్ విషెస్ అందించడంతో పాటుగా “పెద్ది” అప్డేట్ కూడా ఏమన్నా ఇస్తాడా లేక తన నుంచి ఎలాంటి ఇంట్రెస్టింగ్ స్పీచ్ వస్తుంది అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక ఛాంపియన్ చిత్రాన్ని ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తుండగా వైజయంతి మూవీస్ వారి సమర్పణలో ఈ డిసెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version