గత కొన్నాళ్ల నుంచి కేవలం టాలీవుడ్ సినిమా లోనే అని కాకుండా దాదాపు అన్ని భాషల సినీ పరిశ్రమల్లో వచ్చే సినిమాల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఒకప్పుడు ప్రతీ సీజన్ లో వరుస సినిమాలతో థియేటర్స్ లో కళకళలాడేవి. కానీ ఇప్పుడు చాలా తక్కువ సంఖ్యలోనే సినిమాలు వస్తుండడంతో థియేటర్స్ వెలవెలబోతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ ఏడాది పరిస్థితి ఇంకా దారుణం.
బాలీవుడ్ లో ధురంధర్ 2 అందరికీ బాగా గుర్తుంది. దాని తర్వాత ముందు సినిమాలు అంతగా గుర్తే లేవు. ఇక మన దక్షిణాది సినిమాకి వస్తే.. టాలీవుడ్ లో ఒక్క సంక్రాంతి సీజన్ తప్పితే అక్కడ నుంచి సరైన హిట్ లేక టాలీవుడ్ బాక్సాఫీస్ దాహంతో తహతహలాడుతుంది. ఇక మలయాళం, తమిళ్ సినిమాల్లో రీసెంట్ గా వచ్చిన సూర్య కరుప్పు, మోహన్ లాల్ దృశ్యం 3 సినిమాలు దుమ్ము లేపి మళ్ళీ అక్కడ బాక్సాఫీస్ ని రివైవ్ చేసాయి.
సో ఏడాది సగానికి చేరుకుంటున్న నేపథ్యంలో కోలీవుడ్, మోలీవుడ్ ఇండస్ట్రీలు మళ్ళీ ఫామ్ లోకి వచ్చాయి కానీ తెలుగు సినిమా మాత్రం ఇంకా ఆ సాలిడ్ హిట్ స్టేటస్ కోసం ఎదురు చూస్తుంది. అయితే ఈ మ్యాజిక్ ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన అవైటెడ్ చిత్రం ‘పెద్ది’ నే చెయ్యాలని డిస్ట్రిబ్యూస్టర్స్, నిర్మాతలు చాలా నమ్మకం పెట్టుకొని ఎదురు చూస్తున్నారు.
‘పెద్ది’ టాలీవుడ్ బాక్సాఫీస్ దాహాన్ని తీరుస్తుందా?
2026 ఆరంభమే తెలుగు సినిమా భారీ నంబర్స్ చూసింది. ఒక్క సంక్రాంతి సీజన్ లోనే ఏకంగా 600 కోట్లకి పైగా గ్రాస్ ని అప్పుడు సినిమాలు జెనరేట్ చేసాయి. కానీ అక్కడ నుంచి మొదలైంది అసలు పరీక్ష. అక్కడ నుంచి ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ కాలేదు. పైగా ప్యారడైజ్, పెద్ది లాంటి సినిమాలు మరింత ఆలస్యం అవుతూ వాయిదా పడటం థియేటర్స్ ని మరింత ఖాళీగా ఉండేలా చేసాయి.
దీనితో ఫైనల్ గా బరిలో మొదట రామ్ చరణ్ ‘పెద్ది’ నే జూన్ 4 తో కొత్త ఊపు తెచ్చేలా సిద్ధం అయ్యింది. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు ఈ సినిమాని భారీ రేట్లకి కొని పెద్ది ఖచ్చితంగా బాక్సాఫీస్ గేమ్ ఛేంజర్ గా నిలుస్తుంది అని భావిస్తున్నారు. ఈ సినిమాతోనే మళ్ళీ థియేటర్స్ కి జనం క్యూలు కడతారు అని బలంగా విశ్వసిస్తున్నారు. సో అటు మలయాళంలో దృశ్యం 3, తమిళ్ లో కరుప్పు చిత్రాల్లా మనకీ ‘పెద్ది’ సినిమా ఈ ఏడాదిలో ఒక రోరింగ్ బ్లాక్ బస్టర్ స్టేటస్ అందుకొని సాలిడ్ కంబ్యాక్ గా నిలుస్తుందో లేదో అనేది ఈ జూన్ 4తో తేలిపోతుంది.
