RC 17: ‘పెద్ది’ స్టైల్ అనౌన్స్మెంట్ గ్లింప్స్ ఉంటుందా?

rc17

ఇప్పుడు టాలీవుడ్ ఆడియెన్స్ అలాగే మెగా ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రేజీ కాంబినేషన్ లలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే దర్శకుడు సుకుమార్ ల కలయికలో చేస్తున్న సినిమా కూడా ఒకటి. రామ్ చరణ్ కెరీర్ 17వ సినిమా ఇది కాగా అభిమానులు సాలిడ్ హైప్ లో ఉన్నారు. అయితే దీనిని డబుల్ చేస్తూ ఈ సినిమాకి సంగీతం అనిరుద్ అందిస్తున్నట్టు వచ్చిన రూమర్స్ కూడా ఇపుడు మరింత వైరల్ అవుతున్నాయి.

అయితే ఫ్యాన్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్సమెంట్ నుంచే బ్యాంగర్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రామ్ చరణ్ పెద్ది, బన్నీ లోకేష్ కనగరాజ్ ల ప్రాజెక్ట్ అనౌన్సమెంట్ వీడియోలకి ముఖ్యంగా వాటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే స్టైల్ అనౌన్సమెంట్ ఈ సినిమాకి కూడా కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఈ దసరా కానుకగా సినిమా మొదలు కానుంది. సుకుమార్క్ స్టైల్ గ్లింప్స్ లాంటిది అనౌన్సమెంట్ కి వస్తుందేమో చూడాలి మరి.

Exit mobile version