
వడ్డే నవీన్ హీరోగా నటించిన ‘నా ఊపిరి’ సినిమాతో విమర్శకుల ప్రసంశలతో పాటు నంది అవార్డును సొంతం చేసుకున్న దర్శకుడు కన్మణి. సున్నితమైన భావోద్వేగాలను సహజంగా తెరకేక్కిస్తాడని పేరు తెచ్చుకున్నారు. సీరియస్, ఆర్ట్ ఫిల్మ్స్ డైరెక్టర్ అనే ముద్రను తొలగించుకోవడం కోసం ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ ‘బీరువా’తో ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా విజయంపై కన్మణి ధీమాను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కన్మణి మీడియాతో మాట్లాడుతూ.. ప్రేక్షకులు కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకే భవిష్యత్ లో సీరియస్ సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. ‘బీరువా’ లంతో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలను తెరకేక్కిస్తానని చెప్పారు. అన్ని వయసుల వారిని ‘బీరువా’ సినిమా ఆకట్టుకుంటుందని అన్నారు. ఉషా కిరణ్ మూవీస్ మరియు ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన సినిమాకు దర్శకత్వం వహించడం సంతోషంగా ఉందని చెప్పారు.