అశోక్ తేజ కాలేయ ఆపరేషన్ విజయవంతం..!

suddala ashok teja

సినీగేయ రచయిత సుద్దాల అశోక్ తేజ కొద్దిరోజులుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆసుపత్రిలో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. కాగా అశోక్ తేజ కాలేయ మార్పిడి చికిత్స విజయవంతమైందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో ఆయనకు ఈ చికిత్స జరిగింది.

నిన్న ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆయనకు ఈ చికిత్స జరిగింది. అదే సమయంలో అశోక్‌ తేజకు కాలేయం దానం చేసిన ఆయన కుమారుడు అర్జున్‌కు కూడా వైద్యులు ఆపరేషన్‌ చేశారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసిన వైద్యులకు ఆయన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పారు. వందల చిత్రాలకు పాటలు రాసిన అశోక్ తేజ ప్రతిష్టాత్మక ఆర్ ఆర్ ఆర్ మూవీకి మూడు పాటలు రాయడం విశేషం.

Exit mobile version