డా. మోహన్ బాబు ‘యమలీల 2’ రిలీజ్ డేట్

yamaleela-2

సూపర్ హిట్ ‘యమలీల’ సినిమాకు ప్రీక్వెల్ గా ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘యమలీల 2’. యలమీలలో సత్యనారాయణ యముడిగా ఆకనిపిస్తే ఇందులో కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు యమధర్మరాజు పాత్రలో కనిపించనున్నాడు. టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఆడియో ఇటీవలే ప్రముఖుల సమక్షంలో జరిగింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని నవంబర్ 28న రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. డాక్టర్ కెవి సతీష్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో దియా నికోలస్ హీరోయిన్ గా కనిపించనుంది. బ్రహ్మానందం చిత్రగుప్తుడి పాత్ర పోషించారు. కోట శ్రీనివాసరావు, ఎమ్మెస్ నారాయణ, పోసాని కృష్ణమురళి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమాకు కృష్ణారెడ్డి సంగీతం సమకూర్చారు. ఈ సినిమాతో ఒకప్పటి స్టార్ దర్శకుడు కృష్ణారెడ్డి తిరిగి పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోవడం ఖాయమని సినిమా యూనిట్ సభ్యులు చెప్తున్నారు.

Exit mobile version