కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన ‘కేజీఎఫ్ 1, 2’ చిత్రాలు యావత్తు మాస్ ప్రేక్షక లోకాన్ని బాగా అలరించాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన`కేజీఎఫ్` రెండు పార్ట్ లు బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయాన్ని సాధించాయి. అందుకే, ‘కేజీఎఫ్ 3’ పై రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఎలాగూ KGF-2 మూవీ క్లైమాక్స్ లో చాప్టర్ 3 గురించి హింట్ ఇవ్వడంతో KGF-3 కూడా వస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
దీనికితోడు, ఆ మధ్య కేజీఎఫ్ చాప్టర్ చాప్టర్ ౩ ఉంటుందని నిర్మాత విజయ్ కిరగందూర్ క్లారిటీ ఇచ్చారు. అప్పుడు ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్ ‘కేజీఎఫ్ పార్ట్ 3’ పై ఏమి మాట్లాడారు అంటే.. ‘కేజీఎఫ్ మూడవ భాగాన్ని ఈ ఏడాది డిసెంబర్ లో ప్రారంభించబోతున్నాము’ అని ఆయన ప్రకటించారు. అయితే, తాజాగా యశ్ అందుకు విరుద్ధంగా స్టేట్ మెంట్ ఇచ్చాడు. కేజీఎఫ్ చాప్టర్ ౩ రాబోతుందనే వార్తల్లో నిజం లేదని యశ్ చెప్పుకొచ్చాడు.