ఇపుడు ఇండియన్ సినిమా నుంచి రాబోతున్న అవైటెడ్ భారీ సినిమాల్లో పాన్ వరల్డ్ లెవెల్లో ప్రెజెంట్ చేస్తున్న సినిమా “రామాయణ” కూడా ఒకటి. ఇందులో రణబీర్ కపూర్ రామునిగా సీతగా సాయి పల్లవి అలానే రావణ పాత్రలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో యష్ నటించడమే కాకుండా నిర్మాతగా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రామాయణ సినిమాకి తాను రావణ్ పాత్రలోనే ఎందుకు నటించారు అనే ప్రశ్నకి తాను ఒక ఆసక్తికర సమాధానం ఇవ్వడం వైరల్ గా మారింది. ఇలాంటి భారీ సినిమాల్లో ఇండియన్ సినిమా ప్రతీ ముఖ్య నటుడూ నటించాల్సిన ఆవశ్యకత ఉంటుంది అని అలానే తన వంతుగా ఈ సినిమాలో తాను భాగం అయ్యినట్టు తెలిపారు.
అంతే కాకుండా తనకి ఈ తరహా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు డార్క్ రోల్స్, ఎక్కువ సంక్లిష్టతతో కూడిన పాత్రలు పర్శనల్ గా ఇష్టం అని అందుకే రామాయణ లో రావణుని పాత్ర చేస్తున్నట్టు అసలు విషయం రివీల్ చేశారు. దీనితో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.
