యష్ తేజ్, జయశ్రీ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న నూతన ప్రేమకథా చిత్రం పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. సుజయ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆర్ఎన్ క్రియేషన్స్ సమర్పణలో చందు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కె. గోపాల్, జె. రవీందర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
చిత్ర ప్రారంభోత్సవంలో ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, దర్శకుడు వి.ఎన్. ఆదిత్య ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. రచయిత, దర్శకుడు మామిడి హరికృష్ణ చిత్ర యూనిట్‌కు స్క్రిప్ట్‌ను అందజేశారు.
నేటి తరం ప్రేమకథల్లో తల్లిదండ్రుల ఆలోచనలు, బాధ్యతలు ఎలాంటి పాత్ర పోషిస్తాయనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు చందు వెల్లడించారు. సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆనందంగా ఉందని నిర్మాతలు పేర్కొన్నారు.
ఈ చిత్రానికి నాగ వంశీ సంగీతం అందిస్తుండగా, నాని బిశెట్టి మరియు సురేష్ జిల్లా సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా భూపతి యాదగిరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఎర్రం రామకృష్ణ వ్యవహరిస్తున్నారు.
