రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ ప్రెస్టీజియస్ చిత్రం ‘టాక్సిక్’ పలుమార్లు వాయిదా పడిన తర్వాత ఎట్టకేలకు ఆగస్ట్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. విడుదల తేదీ దగ్గరపడటంతో ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ఈ చిత్రం సెన్సార్ పనులు కూడా ముగించుకుంది.
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఇప్పటికే ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేయగా, తాజాగా ఈ చిత్ర రన్‌టైమ్ రివీల్ అయింది. ఈ చిత్రానికి ఏకంగా 3 గంటల 14 నిమిషాల భారీ రన్‌టైమ్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ రేంజ్లో లెంగ్తీ రన్‌టైమ్ లాక్ చేసుకోవడంతో ఈ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి ఏర్పడింది.
ఇక ఈ సినిమాలో యష్ వైవిధ్యమైన గెటప్స్‌లో కనిపిస్తుండగా స్టార్ హీరోయిన్లు కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేయగా కేవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.
