కన్నడ రాకింగ్ స్టార్ హీరో యశ్ హీరోగా రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, తార సుతారియా హీరోయిన్స్ గా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం ‘టాక్సిక్’ కోసం అందరికీ తెలిసిందే. ఎంతో లేట్ అయినప్పటికీ షాకింగ్ బుకింగ్స్ ని ఇండియా వైడ్ గా ఈ చిత్రం చూపిస్తూ ఆశ్చర్యపరిచింది.
ఇక మన తెలుగు వెర్షన్ లో కూడా ఊహించని బుకింగ్స్ అది కూడా టికెట్ ధరల హైక్ ఉన్నప్పటికీ చిత్రం అందుకోవడం విశేషం. ఇలా నైజాం మార్కెట్ లో మంచి స్టార్ట్ తో ఈ సినిమా మొదలైనట్టు తెలుస్తుంది. ఈ సినిమా మొదటి రోజు నైజాంలో 9 కోట్లకి పైగా గ్రాస్ 5 కోట్లకి పైగా షేర్ ని అందుకున్నట్టుగా పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి.
సో తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈజీగా 20 కోట్లకి పైగా గ్రాస్ ని ఈ సినిమా అందుకుని ఉండొచ్చు. ఇక డే 2 నుంచి వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి మరి. ఈ చిత్రానికి రవి బాసృర్ సంగీతం అందించగా యశ్, కే వెంకట నారాయణ నిర్మాణం వహించారు.
