మహి వి రాఘవ్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం యాత్ర .దివంగత నేత మాజీ ముఖ్య మంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జీవిత చరిత్ర తో తెరకెక్కుతున్నది ఈ చిత్రం. ఇక నిన్నవిడుదలైన ఈ చిత్ర టీజర్ పోస్టర్ చిత్రం ఫై ఉన్న అంచలనాలను పెంచేలా ఉంది .
ఇక ఈ చిత్ర టీజర్ ను రాజశేఖర్ రెడ్డిగారి జయంతి సందర్బంగా జూలై 8న విడుదలచేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఒక్క షెడ్యూల్లోనే షూటింగ్ మొత్తం ముగియనుంది. జగపతిబాబు, సుహాసిని, రావు రమేష్, అనసూయ, సచిన్ ఖేడేకర్ వంటి ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
