పవన్ మరో రీమేక్ పై కన్నేసిన ‘ఈగ’ సుధీప్??

Sudeep
కన్నడలో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న సుధీప్ ని దర్శకధీరుదు ఎస్ఎస్ రాజమౌళి ‘ఈగ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసాడు. అప్పటి నుంచి ఈగ సుధీప్ గా ప్రేక్షకుల మదిలో గుర్తుండి పోయాడు. రీసెంట్ గా వచ్చిన బాహుబలి, పులి సినిమాలలో కూడా ఓ చిన్న పాత్రలో కనిపించి మెప్పించాడు. ఇది పక్కన పెడితే సుధీప్ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలను కన్నడలో రీమేక్ చేసే పనిలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన అత్తారింటికి దారేది సినిమాని కన్నడలో రీమేక్ చేసి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు సుధీప్.

తాజాగా సుధీప్ మరో పవన్ సినిమా రీమేక్ పై కన్నేసాడు. అదే ‘గోపాల గోపాల’. ఈ సినిమాని కన్నడలో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్న సుధీప్ ఈ సినిమా కోసం ఓ క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేసే పనిలో ఉన్నాడు. సుధీప్ ఈ సినిమాలో పవన్ చేసిన శ్రీ కృష్ణుడి పాత్రలో కనిపించనుంటే వెంకటేష్ పాత్ర కోసం కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రని అప్రోచ్ అయ్యాడు. సుధీప్ ప్రస్తుతం ఉపేంద్రతో మంతనాలు జరుపుతున్నాడు. అన్నీ ఓకే అయితే ఉపేంద్ర – సుధీప్ కాంబినేషన్ లో గోపాల గోపాల రీమక్ కన్నడలో సెట్స్ పైకి వెళ్తుంది.

Exit mobile version