
యంగ్ హీరో నాని నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా ఈ ఏడాది సమ్మర్ కానుకగా కూల్ అండ్ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా నిలిచింది. ఈ సినిమాతో నాగ్ అశ్విన్ డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. అలాగే స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రియాంక దత్ చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో వచ్చి హిట్ అందుకుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఈ ఇద్దరు యంగ్ టాలెంట్స్ పెళ్లి చేసుకోవడానికి సిద్దమయ్యారు.
కాస్త గతంలోకి వెళితే.. ప్రియాంక దత్ – నాగ్ అశ్విన్ లు మొదట ‘యాదోన్ కి బారాత్’ అనే షార్ట్ ఫిల్మ్ కోసం కలిసి పనిచేసారు. ఆ తర్వాత వారి పరిచయం స్నేహంగా మారింది, ఆ తర్వాత ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఎవడే సుబ్రమణ్యం సినిమా తర్వాత ఇరువురి కుటుంబ సభ్యులు పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ జంట పెళ్ళికి సిద్దం అవుతున్నారు. ఇదిలా ఉంటే నాగ్ అశ్విన్ తన తదుపరి సినిమా కోసం స్క్రిప్ట్ రాసుకుంటూ ఉంటే, ప్రియాంక దత్ మాత్రం మరో మంచి సినిమాని అందించడానికి కథలు వింటోంది.