‘రేసు గుర్రం’, ‘పటాస్’, ‘రుద్రమదేవి’, ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’, ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ సినిమాల్లో బాల నటుడిగా ప్రేక్షకుల ప్రసంశలు అందుకున్న విక్రమ్ సహిదేవ్… ‘ఎవడు తక్కువ కాదు’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న చిత్రమిది. ‘ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్’… ఉపశీర్షిక. రఘు జయ దర్శకుడు. సోమవారం చిత్రంలో తొలి పాట ‘లైఫ్ ఈజ్ ఏ క్యాసినో’ విడుదల చేశారు. ఏప్రిల్ లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.
నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ “టీజర్, పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. విక్రమ్ సహిదేవ్ డైలాగ్ డెలివరీ బావుందని ప్రశంసిస్తుంటే సంతోషంగా ఉంది. ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్… అనేది ప్రధాన పాత్రలో నటిస్తున్న విక్రమ్ సహిదేవ్ క్యారెక్టర్ కు ఫర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. న్యూ ఏజ్ రివెంజ్ డ్రామా ఇది. చిత్రీకరణ పూర్తయింది. మా సంస్థలో ఇది ఓ మంచి సినిమాగా నిలవటంతో పాటు, విక్రమ్ మంచి పేరు తీసుకొస్తుందని నమ్మకంగా ఉన్నాం. త్వరలో పాటలను, ఈ నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.
ప్రియాంక జైన్ కథానాయికగా, రఘు కారుమంచి కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి హరి గౌర సంగీత దర్శకుడు. రఘు జయ దర్శకుడు. లగడపాటి శ్రీధర్ నిర్మాత. లగడపాటి శిరీష సమర్పణ.
