యంగ్ ఫిల్మ్ మేకర్స్ కి నిఖిల్ బంపర్ ఆఫర్

యంగ్ ఫిల్మ్ మేకర్స్ కి నిఖిల్ బంపర్ ఆఫర్

Published on Aug 2, 2015 8:09 PM IST

nikhil
‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘సూర్య vs సూర్య’ సినిమాలతో బాక్స్ ఆఫీసు వద్ద హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న యంగ్ హీరో నిఖిల్. ఈ మూడు సినిమాలతో ఒక నటుడిగా వైవిధ్యాన్ని చూపడమే కాకుండా, మార్కెట్ పరంగా కూడా తన పరిధిని పెంచుకున్నాడు. ప్రస్తుతం నిఖిల్ తన తదుపరి సినిమా ‘శంకరాభరణం’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. ఇటీవలే నిఖిల్ పై వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ ని షూట్ చేసారు. ఇది కాసేపు పక్కన పెడితే నిఖిల్ యంగ్ ఫిల్మ్ మేకర్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు.

‘ఇండస్ట్రీలో అవకాశాలు లేక చాలా మంది టాలెంట్ ఉన్నా బయటే ఉన్నారు అనే విషయాన్ని నేను చాలా బాగా నమ్ముతాను. వాళ్ళకి నేను సాదరంగా వెల్కమ్ చెబుతున్నాను. మీరు మీ ఐడియాలని, కథలని నాకు చెప్పండి. నా టీం మీ స్క్రిప్ట్స్ కోసం వేచి చూస్తోంది. Scripts.nikhil@gmail.com అనే మెయిల్ ఐడికి మీ షార్ట్ ఫిల్మ్స్, మీ స్టొరీ ఐడియాస్, వీడియోస్, వన్ లైన్ స్టోరీస్ ని మెయిల్ చేయండని’ నిఖిల్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసాడు. మరికెందుకు ఆలస్యం ఫ్రెండ్స్.. మీలోని టాలెంట్ ని పేపర్ మీద పెట్టి నిఖిల్ పంపండి. కాన్సెప్ట్ నచ్చిందా, మీకే దక్కుతుంది నిఖిల్ ని డైరెక్ట్ చేసే అవకాశం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు