
సిల్వర్ స్క్రీన్ ప్రభావంతో పాటు, బుల్లితెర ప్రభావం కూడా ఆడియన్స్ పై ఎక్కువగా ఉంది. అలాంటి బుల్లితెరపై ‘బాలిక వధు’ సీరియల్ తో నార్త్ ఇండియాలో ఫుల్ క్రేజ్ తెచ్చుకొని ఆ తర్వాత ‘చిన్నారి పెళ్ళికూతురు’గా తెలుగు ప్రజలను మెప్పించిన నటి అవికా గోర్. చిన్నారి పెళ్లి కూతురుతో ప్రమోషన్ కొట్టేసి సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చే ఛాన్స్ కొట్టేసిన అవికా గోర్ ఉయ్యాలా జంపాలా సినిమాతో మొదటి హిట్ అందుకుంది. ఆ తర్వాత ‘లక్ష్మీరావే మా ఇంటికి’ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది.
అవికా గోర్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ ‘సినిమా చూపిస్తా మామ’. ఈ సినిమా ఆగష్టు 15న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా అడుగులేస్తున్న ఈ భామ భవిష్యత్ లో కచ్చితంగా డైరెక్టర్ అవుతుందట. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అవిక తన మనసులోని మాటని బయటపెడుతూ ‘ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ లో నేను ప్రస్తుతం ఆన్ లైన్ స్క్రీన్ రైటింగ్ పై కోర్సు చేస్తున్నాను. కచ్చితంగా ఓ రోజు నేను డైరెక్టర్ అవుతాను. ఇప్పుడు చేస్తున్న కోర్స్ రైటింగ్ ప్రాసెస్ ని, ఫిలిం మేకర్ మేకర్స్ యొక్క స్కిల్స్ ని తెలుసుకోవడానికి’ ఉపయోగపడుతోంది.
‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో హిట్ పెయిర్ అనిపించుకున్న రాజ్ తరుణ్ – అవికా గోర్ కాంబినేషన్ లో వస్తున్న ‘సినిమా చూపిస్తా మామ’ సినిమా కూడా అ రేంజ్ విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.