నేపాల్ బాధితులకు చేయూతగా నిలిచిన హీరోయిన్

Hansika
2015 ఏప్రిల్ 25న ప్రకృతి విలయతాండవమాడింది. నేపాల్ మరియు భారతావనిలో కొన్ని ప్రదేశాలని భారీ భూకంపంతో భీభత్సం సృష్టించింది. భూకంప భాదితులకు దాతలు తమవంతు సహాయం చేస్తునేవున్నారు. ముఖ్యంగా సౌత్ ఇండియన్ ఫిలిం నుండి భారీ మొత్తంలో విరాళాలు అందుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం యువనటి హన్సిక భూకంప బాధితుల సహాయార్ధం 6 లక్షలు నేపాల్ ప్రభుత్వానికి అందజేసింది.ఆమె సామాజిక స్పృహకు ఇండస్ట్రీప్రముఖులచే ప్రశంసలు అందుకుంటుంది.తన జన్మదినం సందర్భంగా ఒక బిడ్డని దత్తత తీసుకుని సాకుతున్న విషయం తెలిసినదే.

Exit mobile version