మాస్ రోల్స్‌పై మనసుపడ్డ యువహీరో!

మాస్ రోల్స్‌పై మనసుపడ్డ యువహీరో!

Published on Sep 7, 2015 7:02 PM IST

Naga-Shourya
‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘లక్ష్మి రావే మా ఇంటికి..’, చిత్రాల ద్వారా లవర్ బాయ్‌లా, మన పక్కింటి కుర్రాడిలా కనిపించి మంచి పేరు సంపాదించుకున్న యువహీరో నాగశౌర్య. ఈమధ్యే ఒక కొత్త ఇమేజ్ కోసం నాగ శౌర్య చేసిన ‘జాదూగాడు’ అనే ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద పరాజయాన్నే నమోదు చేసిన మాస్ రోల్‌లో నాగ శౌర్య మంచి ప్రతిభ కనబరిచారు. ముఖ్యంగా మాస్ డైలాగ్స్, ఈజ్ యాక్టింగ్‌లో ఈ యువహీరో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నారు.

కాగా జాదూగాడు సినిమా పరాజయం సాధించినా, తనకు మాస్ రోల్ సరిగ్గా సెట్ అవుతుందన్న అభిప్రాయం వెలువడ్డ నేపథ్యంలో నాగ శౌర్య, మరోసారి మాస్‌రోల్‌లో మెప్పించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమ్మాయితో అబ్బాయి, కళ్యాణ వైభోగమే అంటూ రెండు రొమాంటిక్ కామెడీలతో సిద్ధమవుతోన్న ఈ యువహీరో, ఆ తర్వాత చేయబోయే సినిమాకు మాస్ నేపథ్యాన్ని ఎంచుకోనున్నట్లు తెలిపారు. రొమాంటిక్ కామెడీలతో మంచి హిట్స్ తెచ్చుకున్న నాగ శౌర్య, మాస్ రోల్స్‌తోనూ హిట్ కొట్టాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు