యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం అర్జున్ సురవరం. టి.సంతోష్ దర్శకత్వం లో ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు సమర్పణలో, రాజ్ కుమార్ ఆకెళ్ళ నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించింది. కాగా గతంలో ఎప్పుడో విడుదలవ్వాల్సిన ఈ చిత్రం కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడుతూ వస్తుంది. కానీ ఎట్టకేలకు ఈ నిరీక్షణకు తేరా పడిందని చెప్పాలి. కాగా దీపావళి పండగ కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తామని ఇదివరకే ప్రకటించిన చిత్ర బృందం, తాజాగా మరొకసారి విడుదల తేదీని మార్చేసిందని చెప్పాలి. కాగా ఎట్టకేలకు నవంబర్ 29న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. కాగా పోసాని కృష్ణమురళి, సత్య, తరుణ్ అరోరా ప్రధాన పాత్రల్లో నటించారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించారు.
