నారా రోహిత్ హీరోగా పరుచూరి మురళీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆటగాళ్ళు’. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో నారా రోహిత్ సరసన హీరోయిన్‌గా బెంగాలీ నటి దర్శన బానిక్ నటిస్తోంది. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. హీరో ఈరోజు డబ్బింగ్ స్టార్ట్ చెయ్యడం జరిగింది.
ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్రలు నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. నారా రోహిత్, జగపతిబాబు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయని సమాచారం. ఈ వేసవిలో సినిమాను విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
