ఫుల్ ఖుషీలో టాలీవుడ్ యంగ్ హీరోస్

Sundeep-Kishan-rahul
తమకి వచ్చిన ఆఫర్స్ లో మంచి సినిమాలను ఎంచుకొని సినిమా సినిమాకి తమ గుర్తింపును, ఇమేజ్ ను పెంచుకుంటూ వెళ్తున్న యంగ్ హీరోస్ సందీప్ కిషన్ మరియు రాహుల్ రవీంద్రన్. ఈ ఇద్దరు హీరోస్ కలిసి చేసిన సినిమా ‘టైగర్’. ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి షో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్ ఓ మంచి బ్రేక్ కోసం చాలా రోజుల నుంచి వేచి చూస్తున్నారు. ఈ టైగర్ సినిమా వారికి అవసరమైన బ్రేక్ ఇచ్చింది. ఈ టైగర్ సినిమా వారిద్దరి కెరీర్ కి మరింత హెల్ప్ అవుతుందని సందీప్, రాహుల్ చాలా హ్యాపీగా ఉన్నారు.

ఎలాంటి సాగదీత లేకుండా ఉన్న షార్ట్ రన్ టైం, ఇద్దరు హీరోల పాత్రలను తీర్చిదిద్దిన విధానం, వేగంగా సాగే నెరేషన్ ఈ సినిమాకి బాగా హెల్ప్ అయ్యాయి. చూసిన ప్రతి ఒక్కరి నుంచి మంచి టాక్ వస్తుండడంతో మౌత్ టాక్ వల్ల రెండవ రోజు నుంచి కలెక్షన్స్ కూడా బాగా ఎక్కువగా వస్తున్నాయి. కమర్షియల్ గా కూడా మంచి హిట్ట్ సినిమాగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. విఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీరత్ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఎన్.వి ప్రసాద్ – ఠాగూర్ మధు కలిసి నిర్మించిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్.

Exit mobile version