మలయాళ స్టార్ ‘మోహన్ లాల్’ మేజర్‌గా, మెగా మేనల్లుడు ‘అల్లు శిరీష్’ సోల్జర్‌గా కలిసి నటించిన అనువాద చిత్రం యుద్ధభూమి. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా మలయాళంలో ‘1971 బియాండ్ బార్డర్స్’ పేరుతో ఈ చిత్రాన్ని తెరెకెక్కించారు. గత ఏడాది మలయాళంలో విడుదలైన ఈ చిత్రం విజయవంతమైంది. ఇప్పుడు తెలుగులో ‘యుద్ధభూమి’ పేరుతో సెన్సార్ పూర్తి చేసుకుని ఈ చిత్రం జూన్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ చిత్రానికి మేజర్ రవి దర్శకత్వం వహించారు. ఈయన తీసిన సినిమాలన్నీ ఆర్మీ నేపధ్యంలోనే ఉంటాయి. దేశభక్తిని చాటిచెప్పే ఈ చిత్రం తెలుగులో కూడా విజయం సాదిస్తుందో లేదో చూడాలి. భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని జాష్ రాజ్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్స్ పై ఏయన్ బాలాజీ తెలుగులోకి అనువాదించారు. ఈ చిత్రానికి సిద్ధార్ద్ విపిన్ సంగీతం సమకూర్చారు.
