ఓటిటి : జీ5 అప్డేట్..”హను మాన్” సౌత్ లో మొదటిగా ఈ భాషలోనే!?

ప్రస్తుతం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ ఓటిటి రిలీజ్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హీరో సెన్సేషనల్ చిత్రం “హను మాన్” (HanuMan Movie) అనే చెప్పాలి. మరి ఈ చిత్రం ఓటిటి హక్కులు సౌత్ కి సంబంధించి జీ5 (Hanu Man On Zee5) వారే సొంతం చేసుకోగా అందులో అఫీషియల్ గా డేట్ ని ఇంకా ఈ చిత్రం ఫిక్స్ చేసుకోవాల్సి ఉంది.

అయితే సౌత్ వెర్షన్ కి సంబంధించి ఒక్క తెలుగు ఆడియెన్స్ మాత్రమే కాకుండా మిగతా భాషలు ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి లేటెస్ట్ గా అయితే జీ 5 వారు ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఆసక్తిగా మారింది. దీనితో ఈ చిత్రం మొదటగా మన తెలుగు వెర్షన్ లోనే అందుబాటులోకి వస్తుంది అన్నట్టుగా వారు రిప్లై ఇచ్చారు. హను మాన్ (Hanu Man OTT Release) తెలుగులో అతి త్వరలో వస్తుంది అని తమిళ్ ఆడియెన్స్ అడగగా కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ చిత్రం ఫస్ట్ తెలుగులో వచ్చి తర్వాత మిగతా భాషల్లో వస్తుందేమో అనిపిస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version