
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన రొమాంటిక్ డ్రామా ‘జీరో’ చిత్రం గత శుక్రవారం విడుదలై మిక్సడ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. భారీ హైప్ తో సుమారు 4000 స్క్రీన్లలకు పైగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో మొదటి వారాంతం ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది.
ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అనుష్క శర్మ , కత్రినా కైఫ్ ముఖ్య పాత్రల్లో నటించగా షారుక్ సతీమణి గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
ఇక 3 రోజులకుగాను ఈచిత్రం యొక్క వసూళ్ల వివరాలు :
ఇండియన్ బాక్సాఫీస్ :
మొదటి రోజు – 20. 14 కోట్లు
రెండవ రోజు – 18.22 కోట్లు
మూడవ రోజు – 20.17 కోట్లు
ఓవర్సీస్ :
మూడు రోజులగాను గ్రాస్ – 35కోట్లు
మూడు రోజులగాను షేర్ – 16కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజులకు గాను గ్రాస్ -110.60 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజులకు గాను షేర్ – 50కోట్లు