2 హిట్స్ ఉన్నా హ్యాట్రిక్ సినిమాకి జీరో బజ్.!


సాధారణంగా ఓ హీరో మరియు దర్శకుడు కాంబినేషన్ లో ఆల్రెడీ 2 హిట్స్ ఉండి హ్యాట్రిక్ సినిమా వస్తుంది అంటే మినిమమ్ బజ్ ఉంటుంది. కానీ యాక్షన్ హీరో విశాల్ నుంచి వస్తున్నా లేటెస్ట్ సినిమా “రత్నం” విషయంలో మాత్రం రివర్స్ గా కనిపిస్తుంది. ఒకప్పుడు మాస్ సినిమాల్లో మంచి మార్క్ ని సెట్ చేసిన వాటిలో దర్శకుడు హరి తెరకెక్కించిన “భరణి” కూడా ఒకటి.

దీని తర్వాత వారి కాంబినేషన్ నుంచి వచ్చిన రెండో సినిమా “పూజ” కూడా మాస్ ఆడియెన్స్ ని ఫ్యామిలీ ఆడియెన్స్ ని మెప్పించి హిట్ అయ్యింది. అయితే మళ్ళీ దాదాపు దశాబ్దం తర్వాత వీరి కాంబినేషన్ నుంచి వస్తున్నా హ్యాట్రిక్ సినిమానే “రత్నం”. ఇది అనౌన్స్ చేసిన టైం లో ఉన్న బజ్ ఇప్పుడు లేదని చెప్పాలి. రేపే రిలీజ్ అయినప్పటికీ ఇక్కడ తెలుగు సహా అటు తమిళ్ లో కూడా మినిమమ్ ఓపెనింగ్స్ అందుకునే రేంజ్ లో కనిపించడం లేదు.

తమిళ్ లో రీరిలీజ్ కి వచ్చిన ‘గిల్లీ’ థియేటర్స్ కూడా తగ్గించలేదు అట అని ఓ టాక్. అలాగే మెయిన్ గా కంటెంట్ పరంగా ప్రమోషన్స్ పెద్దగా ఆడియెన్స్ లో అటెన్షన్ ని తెచ్చుకోలేదు. దీనితో ఈ మాస్ కాంబినేషన్ పై ఆడియెన్స్ లో ఏమంత ఆసక్తి కనిపించడం లేదు. దీనితో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి మరి.

Exit mobile version