పాటల సమీక్ష : నా నువ్వే – కళ్యాణ్ రామ్ కెరీర్లోనే ప్రత్యేకమైన పాటలు

పాటల సమీక్ష : నా నువ్వే – కళ్యాణ్ రామ్ కెరీర్లోనే ప్రత్యేకమైన పాటలు

Published on May 7, 2018 11:09 AM IST

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ‘నా నువ్వే’. జయేంద్ర దర్వకత్వంలో రూపొందిన ఈ చిత్రం యొక్క ఆడియో నిన్నే విడుదలైంది. ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు శరత్ వాసుదేవన్ సంగీతం అందించిన ఈ చిత్ర పాటలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

1. పాట : హేయ్ హేయ్ ఐ లవ్ యు Hey Hey Ilu

గాయనీ గాయకులు : టిప్పు
సాహిత్యం : అనంత శ్రీరామ్

‘హేయ్ హేయ్ ఐ లవ్ యు’ అంటూ మొదలయ్యే ఈ పాటలోని సంగీతం చాలా కొత్తగా ఉంది. సంగీత దర్శకుడు దర్శకుడు శరత్ వాసుదేవన్ పాట యొక్క థీమ్ కి తగ్గట్టు రకరకాల మెసేజ్, వాట్సాప్ టోన్ సౌండ్స్ ని కూడ బాణీల్లో అద్భుతంగా మిక్స్ చేసి సరదాగా అనిపించే సంగీతాన్ని అందించారు. అలాగే టిప్పు గాత్రం, అనంత శ్రీరామ్ సాహిత్యం కూడ బాగున్నాయి.

Nijama Manasa2. పాట : నిజమా మనసా 
గాయనీ గాయకులు : యాజిన్ నిజార్, ఎం.ఎం.మానసి 
సాహిత్యం : అనంత శ్రీరామ్ 

‘నిజమా మనసా’ అంటూ మొదలయ్యే ఈ పాట నెమ్మదిగా మొదలై మధ్య మధ్యలో హై పిచ్ అందుకుంటూ వినడానికి హాయిగా ఉంది. బాణీలని ఒక పద్దతిలో చక్కగా కూర్చితే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ పాటలోని సంగీతం. సంగీత దర్శకుడు శరత్ వాసుదేవన్ ప్రావీణ్యం ఈ పాటలో సుష్పష్టంగా తెలిసిపోతోంది. ఇక యాజిన్ నిజార్, ఎం.ఎం.మానసి గాత్రం, అనంత శ్రీరామ్ సాహిత్యం కలిసి పాటను ఆల్బమ్ లోని ఉత్తమైన పాటల్లో ఒకటిగా నిలిపాయి.

3. పాట : రైట్ రైట్Right Right Right
గాయనీ గాయకులు : టిప్పు
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి

‘ఓలా.. ఓలా.. టాక్సీవాలా’ అంటూ హీరో నేపథ్యంలో నడిచే ఈ పాట కొంత రెగ్యులర్ గానే ఉంది. హీరో పాత్రని, ఫిలాసఫీని వివరిస్తూ సాగే ఈ పాటకు శరత్ వాసుదేవన్ అందించిన ఫాస్ట్ బీట్ సంగీతం కూడ నార్మల్ గానే ఉంది. మిగతా పాటల్లో ఉన్నంత ప్రత్యేకత ఈ పాటలో వినబడలేదు కానీ పాటైతే ఓకే అనే స్థాయిలోనే ఉంది.

Chiniki Chiniki4. పాట : చినికి చినికి
గాయనీ గాయకులు : కార్తిక్, సప్తపర్ణ
సాహిత్యం : అనంత శ్రీరామ్

‘చినికి చినికి చిలిపి గాలి తడి తగిలి’ అంటూ మొదలయ్యే ఈ రొమాంటిక్ పాటలో సాహిత్యం, సంగీతం రెండూ పోటా పోటీగా ఉన్నాయి. పాట వింటున్నంతసేపు రొమాంటిక్ ఫీల్ కలుగుతోంది. కార్తిక్, సప్తపర్ణల గాత్రం, శరత్ సంగీతం కలిసి పాటను ఎఫెక్టివ్ గా మార్చాయి. రచయిత అనంత శ్రీరామ్ అందించిన ‘వయసు వాగు వాడి పెరిగి పెరిగి మనసు గండి పడి వరదై వరదై ఉరుకు ప్రేమ నది’ లాంటి సాహిత్యం పాటను మనసును తాకేలా చేసింది.

5. పాట : ప్రేమిక side
గాయనీ గాయకులు : శరత్ వాసుదేవన్
సాహిత్యం : అనంత శ్రీరామ్

‘ప్రేమికా…మనస్సు పై స్వారీ చేసేయ్’ అంటూ హై పిచ్ లో ఆరంభమయ్యే ఈ పాటలో మంచి ఫీల్ వినిపిస్తోంది. ‘నమ్మకాన్ని శ్వాసలాగ తీసుకుంది నీ నాయిక’ లాంటి బరువైన సాహిత్యం సినిమాలో ఈ పాటకు ఎంత బలమైన సందర్భం ఉందో సూచిస్తోంది. ఈ పాటకు ప్రధాన బలం శరత్ వాసుదేవన్ గాత్రం. ఆయన గాత్రం తెలుగువారికి అంతగా పరిచయంలేనిది కావడంతో కొత్త అబిభూతిని కలిగిస్తోంది. ఆలాగే పాటకు ఆయన అందించిన కూడ బాగుంది. అన్నీ గాత్రం, సంగీతం, సాహిత్యం అన్నీ సరిగ్గా కుదిరిన ఈ పాట ఆల్బమ్ లోని మంచి పాటల్లో ఒకటిగా నిలుస్తుందనటంలో సందేహం లేదు.

Naa Nuvve6. పాట : నా నువ్వే
గాయనీ గాయకులు : ప్రియా మాలి
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి

‘నువ్వే పిలుపులు.. తలపులు నువ్వే’ అంటూ హీరోయిన్ నేపథ్యంలో సాగే ఈ పాట సినిమాకు థీమ్ సాంగ్ లా అనిపిస్తోంది. ‘తపించే క్షణాలకు నిరాశే చూపించకు.. నా నువ్వే’ లాంటి సాహిత్యం కథానాయిక ప్రేమలోని తీవ్రతను తెలియజేస్తుండగా శరత్ వాసుదేవన్ మెలోడీ సంగీతం పాటను మళ్ళీ మళ్ళీ వినాలనేలా చేసింది.

7. పాట : హేయ్ హేయ్ ఐ లవ్ యు side
గాయనీ గాయకులు : రిత
సాహిత్యం : అనంత శ్రీరామ్

ఈ పాట అచ్చు మొదటి పాటలనే ఉన్నా హీరోయిన్ నైపథ్యంలో సాగేదిగా ఉంది. ఈ పాటలోని సంగీతానికి మొదటి పాటలోని సంగీతానికి మధ్యన కొంత తేడా మాత్రం కనిపిస్తోంది. గాయని రిత పాడిన విధానం పాటను మేల్ వెర్షన్ కంటే ఈ పాటను కొంత ఎక్కువ బెటర్ గా చేసింది.

తీర్పు:

హీరో కళ్యాణ్ రామ్ కెరీర్లోనే ఈ ‘నా నువ్వే’ పాటలు ప్రత్యేకమైనవిగా, ఉత్తమమైనవిగా నిలిచిపోతాయనడంలో సందేహమే లేదు. సంగీత దర్శకుడు శరత్ వాసుదేవన్ ఈ పాటలకు తన బాణీలతో ప్రాణం పోసి కొన్ని పాటల్ని మళ్ళీ మళ్ళీ వినాలనేలా చేశారు. ముఖ్యంగా ‘ప్రేమిక, నా నువ్వే, చినికి చినికి, నిజమా మనసా’ లాంటి పాటలు చాలా బాగుండగా ‘హేయ్ హేయ్ ఐ లవ్ యు, రైట్ రైట్’ పాటలు పర్వాలేదనిపించాయి. మొత్తం మీద సంగీత ప్రియులను మెప్పించే ఈ పాటలు సినిమాను మంచి మ్యూజికల్ హిట్ గా నిలబెట్టేలా ఉన్నాయని చెప్పొచ్చు.

Click here for English Music Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు