Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : రసవత్తరమైన డర్టీ పిక్చర్
Published on Dec 3, 2011 2:04 am IST

విడుదల తేది : 02 డిశంబర్ 2011
123 తెలుగు .కామ్ రేటింగ్ : 3.5/5
దర్శకుడు : మిలన్ లుత్రియా
నిర్మాత :ఏక్త కపూర్ , శోభ కపూర్
సంగిత డైరెక్టర్ : విశాల్ ఢఢ్లాని, శేఖర్ రాజివని
తారాగణం : విద్యా బాలన్, నసీరుద్దిన్ షా, ఎమ్రాన్ హష్మి, తుషార్ కపూర్, ఇమ్రాన్ హస్నీ, అంజు మహేంద్రు

ఈ సంవత్సరం బాగా వివాదాలు సృష్టించిన సినిమాల్లో “ది డర్టీ పిక్చర్’ ఒకటి. ఈ సినిమా సిల్క్ స్మిత జీవిత కథ మీద తీసారంటూ విపరీతమైన ప్రచారం జరిగింది. మిలన్ లుథారియా డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజే విడుదలైంది. ఈ సినిమాని ఏక్తా కపూర్ నిర్మించారు.

కథ: రేష్మ (విద్యా బాలన్) పెద్ద హీరోయిన్ అయిపోవాలని చెన్నైకి వస్తుంది. కొద్ది రోజుల్లోనే నటిగా అవకాశం వస్తుంది. ఎక్కువగా ఐటెం గర్ల్ పాత్రలు వస్తుంటాయి. తరువాత ఆమెకి ‘సిల్క్’ అనే బిరుదు వస్తుంది. తన గ్లామర్ తో మొత్తం ఇండస్ట్రీని శాసించే స్థాయికి చేరుకుంటుంది. బాగా డబ్బు కూడా వస్తుంది. ఇదిలా ఉండగా సౌత్ సూపర్ స్టార్ సూర్య కాంత్ (నసీరుద్దిన్ షా) మరియు రమా కాంత్ (తుషార్ కపూర్) తో సంభందం కొనసాగిస్తుంది. కొద్ది రోజులకి మత్తుకి బానిసై అవకాశాలు కోల్పోతుంది. ఆమె జీవితం పతనమయ్యే సమయంలో డైరెక్టర్ అబ్రహం (ఎమ్రాన్ హష్మి) ఆమె వైపు నిలుస్తాడు. గతంలో అబ్రహం ఆమెని విమర్శించేవాడు. తరువాత ఎం జరిగిందనేది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్: ఈ సినిమాకి మెయిన్ ప్లస్ విద్యానే. అధ్బుతంగా నటించింది. రేష్మ పాత్రకి ఆమె అతికినట్లు సరిపోయింది. ఆ పాత్రలో ఇమిడిపోయి చేసింది. ఆ పాత్రకి ఆమె తప్ప ఇంకెవరు చేయలేరు అనుకునేలా చేసింది. ఐటెం గర్ల్ పాత్ర అయినా చీప్ గా, అసభ్యంగా గా కనపడకుండా చేసింది. నసీరుద్దిన్ షా సూర్య కాంత్ పాత్రకి తగ్గట్లుగా సరిగ్గా చేసారు. పంచ్ డైలాగులు వదలడంలో ఆయన తన ప్రత్యేక శైలి చూపించారు. ఎమ్రాన్ హష్మి మరియు తుషార్ కపూర్ పర్వలేదనిపించాగా ఎమ్రాన్ హష్మి ఆయన గత చిత్రాల్లో చేసే పాత్రల కంటే పూర్తి భిన్నమైన పాత్రని పోషించారు. అంజు మహేంద్రు జర్నలిస్ట్ గా బాగా చేసింది. పాటల చిత్రీకరణ కూడా బాగా చేసారు. విద్యా బాలన్ మరియు ఇతర పాత్రలతో వచ్చే సన్నివేశాలు బాగా వచ్చాయి. పతాక సన్నివేశాలు అధ్బుతంగా పండాయి. చిత్ర మొదటి భాగం ఎంటర్టైనింగ్ గా సాగుతూ ఉంటుంది. మిలన్ లుథారియా దర్శకత్వం చాల బావుంది. స్క్రిప్ట్ బలంగా ఉండటంతో బాగా ప్లస్ అయింది.

మైనస్ పాయింట్స్: చిత్ర రెండవ భాగం నెమ్మదిగా సాగుతుంది. కొన్ని పాత్రలకి సరైన ముగింపు ఇవ్వలేదు. విద్యా బాలన్ తన తల్లితో ఉన్న రిలేషన్ సరిగా లేకపోవడం, తన ఆస్తులు ఎలా పోగుట్టుకొందో సరిగా చూపించలేకపోయారు.

సాంకేతిక విభాగం: పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి బాగా హెల్ప్ అయ్యాయి. ఊలాల ఊలాల పాట ముందు వరుసలో ఉండే ప్రేక్షకులతో ఈలలు వేయించింది. సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ బావున్నాయి. డైలాగులు మాస్ ప్రేక్షకులుకు నచ్చే విధంగా బావున్నాయి. స్క్రిప్ట్ కూడా సినిమా విజయంలో ముఖ్య పాత్ర పోషించింది.

తీర్పు: డర్టీ పిక్చర్ చిత్రం కేవలం విద్యా బాలన్ కి మాత్రమే అంకితం. తను మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. తన నటనతో మిమ్మల్ని తన వైపు తిప్పుకునేలా చేస్తుంది. బలమైన కథ, ఆసక్తి కలిగించే కథనం ఈ చిత్రానికి ముఖ్య బలం.డర్టీ పిక్చర్ చిత్రం చాల బావుంది చూడండి. ఈ చిత్రం మిమ్మల్ని తప్పక కాలక్షేపం చేస్తుంది.

అశోక్ రెడ్డి . ఎం

123తెలుగు.కాం రేటింగ్: 3 .5/5

The Dirty Picture Review English Version


సంబంధిత సమాచారం :