బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : ఓం నమో వేంకటేశాయ
Back | Next
ఓం నమో వేంకటేశాయ : కింగ్ అక్కినేని నాగార్జునతో 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'షిర్డీసాయి' లాంటి భక్తిరస చిత్రాలను తీసిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన మరో భక్తిరస చిత్ర్రమే 'ఓం నమో వెంకటేశాయ'. సూపర్ హిట్ కాంబినేషన్ కావడంతో మొదటీ వీక్ ఓపెనింగ్స్ బాగానే ఉన్నా రెండవ వారంలోకి వచ్చే సరికి అవి తగ్గుముఖం పట్టాయి.

 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 3వ స్థానంలో ఉంది.
.
సినిమాలోని ఆకర్షణీయమైన అంశాలలో హాతి రామ్ బావాజీగా నాగార్జున, వేంకటేశ్వర స్వామిగా సౌరభ్ రాజ్ జైన్ అభినయం ముందుంటాయి. వీరిద్దరూ సినిమాకి సగం ప్రాణం పోస్తే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తన నూరు సినిమాల అనుభవాన్ని రంగరించి సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దారు. హాతిరాం జీవితంపై సాగిపోయే మొదటి భాగం, భావోద్వేగ సన్నివేశాలతో కూడిన సెకండాఫ్ లు బాగా ఆకట్టుకుంటాయి. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాల్లో దేవుడే భక్తుడి వెంటపడటం, అతని కోసం భాధపడటం వంటి సన్నివేశాలు మనసుకు హత్తుకుంటాయి. ఇక కీరవాణి పాటలైతే ఆద్యంతం అలరించగా సినిమాటోగ్రఫీ కనులవిందు చేసింది.

 
ఈ భక్తిరస చిత్రంలో బలహీనతలంటే కృష్ణమ్మ (అనుష్క) ఎపిసోడ్ అని చెప్పొచ్చు. భక్తురాలిగా ఆమె ప్రస్తుతం బాగున్నా గతం అంత బలంగా లేదు. ఆ ఎపిసోడ్ తో కథనం నెమ్మదించింది. అలాగే ఫస్టాఫ్ లో రావు రమేష్ పాత్ర చుట్టూ అల్లిన కొన్ని సన్నివేశాల నైపథ్యం అంతే అయినా వాటిని చూపిన విధానం పాతదే కావడం నిరుత్సాహపరించింది.
 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : పర్వాలేదు
 
బి సెంటర్స్ : అంత బాగోలేదు
 
సి సెంటర్స్ : అంత బాగోలేదు
 
తీర్పు: అంత బాగోలేదు
 
Bookmark and Share