బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : యమన్
Back | Next
యమన్ : 'బిచ్చగాడు' సినిమాతో తెలుగు పరిశ్రమలో సంచలనం సృష్టించిన తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం 'యమన్'. ప్రచార కార్యక్రమాలు భారీగా చేయడం, టీజర్, ట్రైలర్ బాగుండటంతో ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి. ఇన్ని అంచనాల మధ్య తమిళంతో పాటలు తెలుగులో కూడా ఈరోజే రిలీజైన ఈ చిత్రం పర్వాలేదని స్థాయిలోనే ఓపెనింగ్స్ సాధించింది.

 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 2వ స్థానంలో ఉంది.
.
ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ వలనే మంచి హైప్ వచ్చిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అతని కోసమే సినిమా చూస్తున్న ప్రేక్షకులకు విజయ్ ప్రతి సీన్లో కనిపిస్తుండటం సంతృప్తిగా ఉంటుంది. అలాగే అతని నటన చాలా బాగుంది. ఒక సాధారణమైన మనిషి నుండి చిన్నస్థాయి రాజకీయ నాయకుడిగా అతను మారిన విధానం చాలా బాగా చూపించారు. అలాగే కరుణాకర్ పాత్ర చేసిన త్యాగరాజన్ నటన కూడా మెప్పించింది. కథలోని మూడు ప్రధాన పాత్రలు నడిచే పొలిటికల్ మైండ్ గేమ్ చాలా చోట్ల బాగుంది.

 
సినిమా కథనం బాగానే ఉన్నా ప్రత్యర్థుల మధ్య జరిగే పొలిటికల్ గేమ్ లోని కొన్ని సందర్భాల్లో ప్రేక్షకుడికి చాలా వరకు కనెక్ట్ కాలేదు. దీంతో ఆ సందర్భాల్లో కాస్త నిరుత్సాహం ఏర్పడింది. హీరోయిన్ మియా జార్జ్ కు కేవలం రెండు పాటలు, 5 సన్నివేశాలకు మాత్రమే పరిమితమవడం కాస్త నెగెటివ్ ప్రభావం చూపింది. సినిమా మాతృక తమిళం కావడం వలన తెలుగు వర్షన్ లో సైతం చాలా చోట్ల తమిళ వాతావరణం కనబడింది. నటీనటుల నటన కూడా తమిళ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగించింది.
 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : ప్రారంభం పర్వాలేదు
 
బి సెంటర్స్ : ప్రారంభం పర్వాలేదు
 
సి సెంటర్స్ : ప్రారంభం పర్వాలేదు
 
తీర్పు: ప్రారంభం పర్వాలేదు
 
Bookmark and Share