బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : ఘాజి
Back | Next
 
ఘాజి : 1971 కాలంలో విశాఖపట్టణ తీరంలో భారతీయ నేవీకి, పాకిస్థాన్ నేవీకి మధ్య జరిగిన, ఎవరికీ తెలియని జలాంతర్గామి యుద్దాన్ని సినిమా ద్వారా బయటి ప్రపంచానికి తెలియజెప్పాలని నూతన దర్శకుడు సంకల్ప్ రెడ్డి రూపొందినచిన చిత్రమే ఈ 'ఘాజి'. మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం రెండవ వారంలో సైతం మంచి స్టడీ కలెక్షన్లు రాబడుటూ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.

 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 3వ స్థానంలో ఉంది.
.
చాలా మందికి ఈ యుద్ధ చరిత్ర అంతగా పరిచయం లేదు కనుక దర్శకుడు సంకల్ప్ రెడ్డి కథను కొన్ని వాస్తవిక అంశాలు, కొన్ని కల్పిత అంశాలు జోడించి చాలా స్పష్టమైన కథను తయారు చేశాడు. ఆయన వేసిన సబ్ మెరైన్ లోపలి సెట్టింగ్స్ చాలా అద్భుతంగా అనిపిపించాయి. సబ్ మెరైన్ నీళ్ళలోకి దిగడం, సముద్రపు అడుగున టార్పీడో (మిసైల్స్) లతో పరస్పర యుద్ధం, ఎస్ 21 ఘాజి ల మధ్య పోరాటం వంటివి విఎఫ్ఎక్స్ ద్వారా బాగా సృష్టించారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్లలో ఇండియన్ నేవీ పని తీరును, వేసిన యుద్ధ ప్రణాళికలను చాలా గొప్పగా చూపించారు. కీలకమైన పాత్రల్లో నటించిన రానా, కే కే మీనన్, అతుల్ కులకర్ణి, సత్యదేవ్ లు నటన ఆకట్టుకుంది.

 
కథ క్లిస్టర్ క్లియర్ గా, ఆసక్తిగా ఉన్నప్పటికీ సినిమాని పైకి లేపే కొన్ని కీలక సన్నివేశాల్లో అనగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్లలో అవసరమైన ఎమోషన్ ను దర్శకుడు సరైన స్థాయిలో ప్రదర్శించలేకపోయాడు. సినిమా అంతా సముద్రం అడుగు భాగం జరుగుతుంది కనుక భారీ స్థాయి యుద్ధ సన్నివేశాలను ఆశించేవారికి కాస్త నిరుత్సాహం కలుగుతుంది. చివరగా ఇండియన్ సబ్ మెరైన్ ఎస్ 21, పాకిస్థాన్ సబ్ మెరైన్ 'ఘాజి' ని కూల్చే సన్నివేశాలు ఇంకాస్త వివరంగా చూపి ఉంటే సంతృప్తిగా ఉండేది. ఇందులో కమర్షియల్ అంశాలకు స్థానం లేదు కనుక బి, సి సెంటర్ల ప్రేక్షకులను మెప్పించడం కష్టమే.
 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : బాగుంది
 
బి సెంటర్స్ : పర్వాలేదు
 
సి సెంటర్స్ : పర్వాలేదు
 
తీర్పు: హిట్
 
Bookmark and Share