బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : 16
Back | Next
 

 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 2వ స్థానంలో ఉంది.
.
ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్లస్ పాయింట్స్ చాలానే ఉన్నాయి. మంచి క్రైమ్ కథ దానికి సరిపడా కొత్త తరహా కథనం ఈ సినిమాకి బాగ్ కలిసొచ్చిన అంశాలు. దర్సకుడు కార్తిక్ నరేన్ రాసుకున్న అద్భుతమైన స్క్రీన్ ప్లేను అంతే చాకచక్యంతో తెర మీద ఆవిష్కరించాడు. ఫస్టాఫ్ అంతా ప్రేక్షకుడు సమాధానం కనుగొనలేని కథనాన్ని నడిపి సెకండాఫ్లో అన్ని చిక్కుముడులను విప్పుతూ ఆద్యంతం సినిమాను మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులకందించాడు కార్తిక్. అలాగే చిత్ర క్లైమాక్స్ కూడా ఏమాత్రం ఊహించని విధంగా చాల ఆసక్తికరంగా ఉంది. మొత్తం మీద ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వాళ్లకు చాలా బాగా నచ్చే విధంగా ఉంది.

 
ఖచ్చితమైనవే అయినప్పటికీ సామాన్య ప్రేక్షకుడికి అంత త్వరగా అందని ఫస్టాఫ్లోని కొన్ని లాజిక్స్ ఈ సినిమాలో మైనస్ పాయింట్స్. సినిమా మొదలైన దగగర్నుంచి ఇంటర్వెల్ పడే వరకు దర్శకుడు ప్రేక్షకుల మీదకి ప్రశ్నల మీద ప్రశ్నలు వదులుతూ సమాధానాలు కనుక్కోండి చూద్దాం అన్నట్టు ఉండే కథనం కొన్ని వర్గాల ప్రేక్షకులకు మాత్రమే నచ్చుతుంది కానీ బి, సి తరగతుల ఆడియన్సుకు పెద్దగా నచ్చదు.
 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : పర్వాలేదు
 
బి సెంటర్స్ : పర్వాలేదు
 
సి సెంటర్స్ : పర్వాలేదు
 
తీర్పు: హిట్
 
Bookmark and Share