బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : కాటమరాయుడు
Back | Start
 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 1వ స్థానంలో ఉంది.
.
అచ్చమైన చేనేత పంచెకట్టులో, మిరా మిరా కోర మీసంతో పవన్ స్క్రీన్ మీద కొత్తగా కనిపిస్తున్నంతసేపు ఫ్యాన్స్ కు పండుగనే చెప్పాలి. పవన్ ఫైట్స్ లో, పంచ్ డైలాగుల్లో, డ్యాన్సుల్లో అభిమానులకు, ప్రేక్షకులకు ఎంజాయ్ చేసేందుకు కావాల్సినంత కంటెంట్ దొరికింది. ఇక శృతి హాసన్ తో నడిచే రొమాంటిక్ సన్నివేశాల్లో పవన్ తన ట్రేడ్ మార్క్ పెర్ఫార్మెన్స్ చూపించాడు పవన్. అలాగే ఫస్టాఫ్లో తమ్ముళ్లు రాయుడిని ప్రేమలోకి దించే ట్రాక్లో అలీ జనరేట్ చేసిన బోలెడంత కామెడీ బాగా నవ్వించింది. శృతి హాసన్ గ్లామరస్ పెర్ఫార్మెన్స్, ఫస్టాఫ్ ను డాలి డీల్ చేసిన విధానం బాగా ఆకట్టుకున్నాయి.

 
సినిమాలోని మైనస్ పాయింట్స్ అంటే అది సెకండాఫ్ అనే చెప్పాలి. ఆరంభం బాగానే ఉన్నా కూడా పోను పోను సినిమాలో ఎంటర్టైన్మెంట్ తగ్గి రొటీన్ గా మారిపోయింది. చాలా సినిమాల్లో చూసినట్టు ఒకటే రొటీన్ కథనం. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ప్రతి సన్నివేశాన్ని ముందుగానే ఊహించవచ్చు. ఇక క్లైమాక్స్ కూడా కొత్తగా ఏమీ లేదు. ఇక ఎపిసోడ్ టేకింగ్ అయినా కొత్తగా ఉందా అంటే అదీ లేదు.. అంటే పవన్ ఇమేజ్ కు తగ్గ స్థాయిలో లేదు. ఫస్టాఫ్ వరకు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన అనూప్ రూబెన్స్ సెకండాఫ్ కు వచ్చేసరికి చల్లబడిపోయాడు.
 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : ప్రారంభం చాలా బాగుంది
 
బి సెంటర్స్ : ప్రారంభం చాలా బాగుంది
 
సి సెంటర్స్ : ప్రారంభం చాలా బాగుంది
 
తీర్పు: ప్రారంభం చాలా బాగుంది
 
Bookmark and Share