ఇంటర్వ్యూ : గోపీచంద్ – సాహసం ప్రయోగాత్మక సినిమా కాదు

ఇంటర్వ్యూ : గోపీచంద్ – సాహసం ప్రయోగాత్మక సినిమా కాదు

Published on Jul 12, 2013 2:48 AM IST

Gopi-Chandభారీ బాడీతో ఆరడుగుల పొడవుతో ఆజాను బాహుడిలా ఉండే టాలీవుడ్ హీరో గోపీచంద్ మొదట విలన్ గా ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత హీరోగా మారి తన యాక్షన్ తో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్నే ఏర్పరుచుకున్నాడు. గత కొంత కాలంగా హిట్స్ అందుకోని గోపీచంద్ ‘ఒక్కడున్నాడు’ లాంటి ఓ డిఫరెంట్ సినిమా చేసిన తర్వాత చంద్రశేఖర్ యేలేటితో మళ్ళీ చేస్తున్న అడ్వెంచరస్ ఫిల్మ్ ‘సాహసం’. ఈ సినిమా ఈ శుక్రవారం అనగా జూలై 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గోపీచంద్ కాసేపు మీడియాతో ముచ్చటించాడు. ఆయన తన గత సినిమాల గురించి, సాహసం మూవీ గురించి, అలాగే తన రాబోయే సినిమాల గురించి, సాహసం పై ఉన్న అంచనాల గురించి మాతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) మీ చివరి సినిమా విడుదలై చాలా కాలం అయినట్టుంది..

స) అవును. చాలా లాంగ్ గ్యాప్ అని చెప్పాలి. నా కెరీర్లో ఇంత పెద్ద గ్యాప్ ఎప్పుడూ రాలేదు. మేము సాహసం మొదలు పెట్టినప్పుడు 6 నెలల్లో పూర్తి చెయ్యాలనుకున్నాం. కానీ స్పెషల్ ఎఫెక్ట్స్, మిగతా విషయాల్లో ఎక్కువ కేర్ తీసుకోవడం వల్ల మరో 6 నెలలు ఎక్కువైంది. కానీ ఫైనల్ అవుట్ పుట్ చూసిన తర్వాత నేను చాలా హ్యాపీ గా ఉన్నాను.

ప్రశ్న) పాకిస్థాన్ ని బేస్ చేసుకొని ఈ సినిమా కథ ఉంటుందా?

స) అవును, హీరో ఒకదానిని వెతకడం కోసం పాకిస్థాన్ వెళతాడు. ఈ కథ పాకిస్థాన్ బోర్డర్ ఏరియాల్లో జరుగుతుంది. ఆ సీక్వెన్స్ లను మేము లడఖ్ లో షూట్ చేసాము. దానివల్ల పాకిస్థాన్ ల్యాండ్ ఫీల్ ని, ఆ వాతావరణ పరిస్థితుల్ని చూపించడం మాకు చాలా సులభం అయ్యింది.

ప్రశ్న) మీ గత సినిమాలు అంతగా ఆడినట్లు లేదు..

స) (నవ్వుతూ) ”అవి బాగా ఆడలేదు కాదండి అవన్నీ ఫ్లాప్ సినిమాలు..”.

ప్రశ్న) ‘సాహసం’ సినిమా కాకుండా అయితే కమర్షియల్ ఎంటర్టైనర్ బదులు యాక్షన్ అడ్వెంచర్ సినిమా చేస్తారా?

స) ‘సాహసం’ ప్రయోగాత్మక సినిమా కాదు. ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. అన్ని సినిమాల్లో ఉన్నట్లే ఈ సినిమాలో కూడా కొన్ని పాటలుంటాయి. ఈ సినిమాలోని రెండు పాటలు సినిమాలోని ఎమోషన్ కి ఎలాంటి ఇబ్బంది కలుగజేయకుండా సరైన సందర్భాల్లో వస్తాయి. మేము సినిమాలోని ఫ్లోని దెబ్బ తీయకూడదనుకున్నాం. అది కాకుండా చంద్రశేఖర్ యేలేటి స్టైల్లో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ ”సాహసం”.

ప్రశ్న) మీ కెరీర్ ని చూసుకుంటే మీరు చేసిన సినిమాల్లో ‘మొగుడు డిఫరెంట్ స్టొరీ. ఆ సినిమాతో మీరు యాక్షన్ హీరో ఇమేజ్ నుంచి బయటకి రావలనుకున్నారా?

స) నాకు కృష్ణవంశీ గారి మీద పూర్తి విశ్వాసం ఉంది. అందుకే నా యాక్షన్ హీరో ఇమేజ్ ని తీసెయ్యమని అడిగాను. నేను ‘నిన్నే పెళ్ళాడతా సినిమా లాగా ఆశించాను కానీ అది నేను అనుకున్నట్లు రాలేదు, అది వేరే దారిలోకి వెళ్ళింది.

ప్రశ్న) మన ఫిల్మ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ తాప్సీ అనగానే టీం ఒకటికి రెండు సార్లు ఆలోచించారా?

స) ”మన టైం బాగోలేనప్పుడు తను మాత్రం ఏం చేస్తుంది?”. రీసెంట్ గా జరుగుతున్న ట్రెండ్ చూసుకుంటే ఫ్లాప్ ఇమేజ్ ఉన్న హీరోయిన్స్ పెద్ద హిట్స్ అందుకుంటున్నారు. అలాగే హిట్స్ అందుకొని ఉన్న హీరోయిన్స్ ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి నేను వాటిని నమ్మను. చంద్రశేఖర్ యేలేటి కూడా తాప్సీని ఎంచుకున్నాడు.

ప్రశ్న) మీరు బాగా ఎక్కువగా వర్క్ చెయ్యడానికి డిమాండ్ ఉన్న సినిమా ఇదేనా?

స) ఫిజికల్ గా అయితే బాగా డిమాండ్ చేసిన సినిమా ఇదే. కొన్ని సీన్స్ చెయ్యడం కోసం 20 రోజులు గుర్రపు స్వారీ నేర్చుకున్నాను. అలాగే లడఖ్ లో బాగా గాలి తక్కువ ఉన్న ఎత్తైన ప్రదేశాలలో షూటింగ్ చెయ్యడం కాస్త కష్టంగా అనిపించింది.

ప్రశ్న) మీ కెరీర్ లోనే ‘సాహసం’ భారీ బడ్జెట్ మూవీ అనుకుంటా..

స) దీనికంతటికీ నేను ఒకటే చెబుతాను.. మేము అనుకున్న దానికంటే బాగా భారీగా, చాలా గ్రాండ్ గా సినిమా ఉంటుంది. మేము పెట్టిన ఖర్చుకి సినిమా లుక్, ఫీల్ సింప్లీ సూపర్బ్ అని చెప్పొచ్చు.

ప్రశ్న) మీ వివాహ జీవితం ఎలా ఉంది?

స) (నవ్వుతూ) బాగుంది.. బ్యాచిలర్ లైఫ్ తో పోల్చుకుంటే ఇది డిఫరెంట్ గా ఉంది. ఇన్ని రోజులు ఆ లైఫ్ ని ఎంజాయ్ చేసాను. ఇప్పుడు ఈ లైఫ్ ని ఎంజాయ్ చెయ్యనివ్వండి.

ప్రశ్న) కష్ట సమయాల్లో మీకు ఎవరు తోడుగా ఉంటారు?

స) నాకు నేనుగా ఈ సినిమా పనిలో బిజీ అయిపోయాను. అది కాకుండా నేని విధిని నమ్ముతాను. ‘మన టైం బాగోలేదు అని వదిలెయ్యటం’.

ప్రశ్న) తెలుగు యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్స్ తో పోల్చుకుంటే ‘సాహసం’ లో డిఫరెంట్ గా ఏముంటుంది?

స) నాకు తెలిసినంత వరకు ఈ జోనర్ లో తెలుగులో చివరిగా వచ్చిన సినిమా ‘టక్కరి దొంగ’. ఆ తర్వాత టెక్నాలజీ బాగా మారిపోయింది, అలాగే బడ్జెట్ లు కూడా పెరిగాయి. దాంతో భారీగా చేయడానికి మాకు అవకాశం దక్కింది. ఆడియన్స్ కి ‘సాహసం’ కొత్త అనుభూతిని ఇస్తుంది.

ప్రశ్న) మీరు చేస్తున్న తదుపరి చిత్రాలేమిటి?

స) ప్రస్తుతం బి. గోపాల్ గారితో, దేవా కట్టాతో సినిమాలు చేస్తున్నాను. బి. గోపాల్ సినిమాకి వక్కంతం వంశీ కథ అందించాడు, నాకు కథ బాగా నచ్చింది. మిగతా కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే వాటి గురించి తెలియజేస్తాను.

ప్రశ్న) మీ దగ్గరకి ముందు ముందు నెగటివ్ రోల్స్ వస్తే మళ్ళీ ఏమన్నా చేసే అవకాశం ఉందా?

స) నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చెయ్యడం అంటే నాకు చాలా ఇష్టం. ”హీరోయిజం ఉండి, నెగటివ్ షేడ్స్ ఉంటే బాగుంటుంది”. దానికి రాజశేఖర్ ‘తలంబ్రాలు’ సినిమా చక్కటి ఉదాహరణ.

ప్రశ్న) సాహసం గురించి ప్రేక్షకులకి మీరేం చెబుతారు?

స) ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీగా అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా ట్రైలర్ కంటే బెటర్ గా ఉంటుంది. సీట్లోనుంచి ప్రేక్షకుల్ని కదలనీయకుండా చేసే సీన్స్ చాలా ఉంటాయి. ఈ సినిమాకి రీ రికార్డింగ్ చాలా బాగా వచ్చింది. శ్యాం దత్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి పెద్ద ప్లస్ అవుతుంది. కాబట్టి ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు.

అంతటితో గోపీచంద్ తో ఇంటర్వ్యూని ముగించి, ”సాహసం” సినిమా పెద్ద హిట్ కావాలని ఆల్ ది బెస్ట్ చెప్పాము. ఈ ఇంటర్వ్యూ మీరు కూడా బాగా ఎంజాయ్ చేసారని ఆశిస్తున్నాం..

ఇంటర్వ్యూ – మహేష్ ఎస్ కోనేరు

అనువాదం – రాఘవ

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు