ఎప్పుడెప్పుడా అని మెగాఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘పెద్ది’ గ్లింప్స్ ట్రీట్ వచ్చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ‘పెద్ది’ నుంచి అదిరిపోయే గ్లింప్స్‌తో అభిమానులను ఖుషీ చేశారు మేకర్స్. పెద్ది సినిమాలో ఇప్పటివరకు రామ్ చరణ్ క్రికెట్ ఆట ఆడుతాడని అందరూ అనుకున్నారు. కానీ, అంతకు మించి ఈ సినిమా ఉండబోతుందని ఈ గ్లింప్స్ నిరూపించింది.
ఈ సినిమాలో క్రికెట్‌తో పాటు కుస్తీ కూడా ఉండబోతుంది. ఇక తాజాగా వచ్చిన గ్లింప్స్‌లో రామ్ చరణ్ కండలు తిరిగిన కుస్తీ పెహల్వాన్‌గా దర్శనమిచ్చాడు. ఆయన ఫెరోషియస్ లుక్‌తో చేతిలో గద పట్టుకుని ఉన్న తీరు అద్భుతంగా కనిపిస్తుంది. రామ్ చరణ్‌ను పూర్తిగా కుస్తీ పెహల్వాన్ అవతారంలో బుచ్చిబాబు ప్రెజెంట్ చేసిన తీరు సూపర్. ఈ లుక్‌లో రామ్ చరణ్‌ను చూసిన అభిమానులు థ్రిల్ అవుతున్నారు.
ఇక బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే డైలాగ్..‘కుస్తీ అంటే బంతితో బ్యాట్‌కు ఎదురెళ్లే ఆట కాదురా.. ప్రాణంతో సావుకు ఎదురెళ్లే ఆట.. ఇప్పుడు సెప్పు.. ఉంటావా పోతావా..’ అనే విలన్ విసిరిన ఛాలెంజ్‌కు పెద్ది చెప్పే వన్ లైనర్ పంచ్ డైలాగ్ అదిరిపోయింది. ‘సూడబ్బి.. ఆటే నా పొగరు..’ అనే రామ్ చరణ్ సమాధానానికి ఆయన్ను ఎలివేట్ చేసిన విజువల్స్ అదిరిపోయాయి. మొత్తానికి పెద్ది సినిమాలో రామ్ చరణ్ కండలు తిరిగిన వస్తాదుగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయబోతున్నాడని తేలిపోయింది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా శివ రాజ్‌కుమార్, జగపతి బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 30న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


