ఇంటర్వ్యూ : ఇగో లేని డార్లింగ్ ప్రభాస్ – కొరటాల శివ

ఇంటర్వ్యూ : ఇగో లేని డార్లింగ్ ప్రభాస్ – కొరటాల శివ

Published on Feb 6, 2013 4:00 AM IST

Koratala-Shiva1

ఇప్పటి వరకు రచయితగా తన ఐడియాలను అందించిన కొరటాల శివ మరికొద్ది రోజుల్లో దర్శకుడిగా తన ఐడియాని తనే ఒక రూపం ఇచ్చి అందించాబోతున్నాడు. ఈ నెల 8న విడుదల కాబోతున్న మిర్చి గురించి కొరటాల శివ చెప్పిన ముచ్చట్లు మీకోసం …

ప్ర : మీరు మొదటిసారి డైరెక్ట్ చేసిన మిర్చి మీద మీ అంచనాలు ఎలా ఉన్నాయి?
స : ‘మా మిర్చి చాలా ఘాటుగా ఉంటుంది’. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే సినిమా మిర్చి. క్లాస్, మాస్ అని తేడా లేకుండా ఇద్దరికీ నచ్చేలా ఉంటుంది.

ప్ర : మీరు రచయితగా పంచ్ డైలాగులు ఎన్నో పేల్చారు. మరి ఈ సినిమాలో ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఏమైనా రాసారా?
స : సినిమా కథని బట్టి పంచ్ డైలాగులు వాటంతట అవే వస్తాయని నేను నమ్ముతాను.మిర్చిలో అన్ని నాచురల్ ఎమోషన్స్ ఉంటాయి. అందుకే ఆర్టిఫిషియల్ గా ఏమి రాయలేదు. ఎంటర్టైనింగ్ డైలాగుల వరకు రాసాను.

ప్ర : తెలుగు చలన చిత్ర పరిశ్రమకి మీ జర్నీ ఎలా సాగింది?
స : బీ.టెక్ పూర్తి చేసిన తరువాత స్క్రిప్స్ రాస్తూ మొదట్లో మా కజిన్ అయిన పోసాని కృష్ణ మురళి గారి వద్ద పనిచేసాను. సోలోగా నా మొదటి సినిమా భద్రకి రచయితగా పనిచేసాను. అప్పటి నుండి మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ వచ్చాను.

ప్ర : ఇండస్ట్రీకి రావడానికి మీ ఇన్స్పిరేషన్?
స : నేను మణిరత్నం గారి సినిమాలంటే ఇష్టం. దర్శకుడిగా ఎమోషన్ సన్నివేశాల్ని ఆయన డీల్ చేసే విధానం నాకు బాగా నచ్చుతుంది. శ్రీశ్రీ గారి మహాప్రస్థానం నాకు ఇన్స్పిరేషన్.

ప్ర : ప్రభాస్ తో కలిసి పనిచేయడం ఎలా ఉంది?
స : ప్రభాస్ తో పనిచేసేటపుడు మొదట్లో ఒక పెద్ద హీరో అనుకుని ట్రీట్ చేసేవాడిని. ఒక పది రోజులు గడిచాక ఒక స్టార్ హీరోలా కాకుండా ఫ్రెండ్ లాగా డీల్ చేశాను. ప్రభాస్ కి ఎలాంటి ఇగోలు లేని డార్లింగ్. అందరితోను అలాగే ఉంటాడు.

ప్ర : తీరిక సమయాల్లో ఏం చేస్తుంటారు?
స : తీరిక సమయాల్లో ఎక్కువగా పుస్తకాలు చదువుతుంటాను.

ప్ర : ఎలాంటి సినిమాలు ఎక్కువ ఇష్టపడతారు?
స : ఎమోషనల్ వేల్యూ ఎక్కువగా సినిమాల్ని ఇష్టపడతాను. ప్రేక్షకులని ఎమోషనల్ గా కట్టిపడేసే సినిమాలు బాగా నచ్చుతాయి.

ప్ర : ఆడియోకి వస్తున్న స్పందన ఎలా ఉంది?
స : ఆడియో ఇప్పటికే పెద్ద హిట్ అయింది. దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే సాంగ్స్ ఇచ్చాడు.

ప్ర : ఫ్యూచర్ ప్రాజెక్ట్స్?
స : ప్రస్తుతం ఒక స్టొరీ మీద కసరత్తు చేస్తున్నా. పిర్చి విడుదలైన తరువాత యాక్షన్ సినిమా చేస్తా.

ప్ర : ప్రేక్షకులు మిర్చి నుండి ఎం ఆశించవచ్చు?
స : మిర్చి స్టైలిష్ ఎంటర్టైనర్ విత్ ఎమోషనల్ సీన్స్. ఈ సినిమాలో నటించిన అందరికీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది. కుటుంబంతో సహా అందరు వచ్చి ఎంజాయ్ చేయతగ్గ సినిమా మిర్చి.

మిర్చి పెద్ద విజయం సాధించి దర్శకుడిగా కొరటాల శివకి మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూ ఇంతటితో ముగిస్తున్నాం.

అనువాదం : అశోక్ రెడ్డి

Click Here For English Interview

సంబంధిత సమాచారం

తాజా వార్తలు