ఓటీటీ : ‘దీవానా’కి 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డు !

ఓటీటీ : ‘దీవానా’కి 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డు !

Published on Aug 3, 2026 12:58 PM IST

హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా చిత్రం ‘దీవానా’. స్మేహ మణిమేగలై హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం 2026 జూన్ 19న థియేటర్లలో విడుదలైంది. మిక్స్డ్ నుంచి సానుకూల స్పందనలతో థియేట్రికల్ ప్రదర్శనను పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ డ్రామా, ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతుంది. ఓటీటీ వేదిక ‘ఆహా’లో విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా 50 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను నమోదు చేయడం నిజంగా విశేషమే.

ఈ 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ప్రేక్షకులలో ఈ చిత్రానికి పెరుగుతున్న ఆదరణను తెలియజేస్తోంది. ఈ చిత్రంలో నరేష్ విజయ్ కృష్ణ, ఝాన్సీ, బలగం వేణు, జీవన్ కుమార్ కీలకమైన సహాయక పాత్రల్లో నటించారు. లవర్స్ కి ఈ సినిమాలో కొన్ని ఎమోషన్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. అందుకే, ఈ సినిమాకి ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తోంది. ఇక ఈ సినిమాకి ఈశ్వర్ చంద్ సంగీతం అందించారు.

తాజా వార్తలు